![Flipkart sale Google Pixel 6a price to drop check here details - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/10/google%20pixel%206a.jpg.webp?itok=otza08wG)
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. అయితే ముందుగానే నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి కొన్ని పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్ ప్రకటించింది.
డిస్కౌంట్‌ఆఫర్‌తో వాస్తవ ధరకంటే చాలా తక్కువకే వీటిని ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్లు సుమారు రూ. 30వేల కంటే తక్కువకే అందించనుంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 6ఏ కొనుగోలుపై గరిష్టంగా 20వేల రూపాయల వరకు ధర తగ్గనుంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కలిపి ఈ తగ్గింపు ఉండనుంది. మరోవైపు అమెజాన్ తన మెగా సేల్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 23న కూడా నిర్వహించనుంది.
గూగుల్ పిక్సెల్ 6ఏ డీల్: రూ. 43,999కి లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఎ, రానున్న సేల్‌లో రూ.27,699లకే లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ. 20వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఫోన్ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్స్
6.1అంగుళాల OLED డిస్‌ప్లే
టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్
ఆక్టా-కోర్ Google Tensor SoC
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
12.2+ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా
8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
4,410mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment