ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్: భారీ డిస్కౌంట్లు
దేశీయ ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి డిస్కౌంట్ల ఉత్సవం నిర్వహించబోతుంది.
సాక్షి, కోల్‌కత్తా : దేశీయ ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి డిస్కౌంట్ల ఉత్సవం నిర్వహించబోతుంది. పండుగ సీజన్ సందర్భంగా సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 24 వరకు తన నాలుగో ఎడిషన్ '' ది బిగ్ బిలియన్ డేస్'' సేల్‌ను నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్సవంలో భాగంగా దాదాపు 90 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అన్ని కేటగిరీలోని ఉత్పత్తులపై మున్నుపెన్నడూ చూడని విధంగా బెస్ట్ డీల్స్‌ను అందిస్తున్నామని, 90 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. తక్కువ చెల్లింపులతో ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లకు తాము కస్టమర్లకు సహకరించనున్నట్టు చెప్పింది.
80 ప్లస్ కేటగిరీల్లో ఎక్స్‌క్లూజివ్ సెలక్షన్, దిగ్గజ బ్రాండులతో ఎక్స్‌క్లూజివ్ భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకోనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. మారథాన్ డీల్స్‌తో పాటు భారతీయ అవసరాలకు అనుగుణంగా ఆఫర్లను స్పెషల్‌గా రూపొందించామని వివరించింది. టీవీ, ప్రింట్, రేడియో, సోషల్ మీడియా, అవుట్‌డోర్స్, డిజిటల్ మీడియా వంటి వాటిల్లో ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ గురించి మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను కూడా కంపెనీ నిర్వహించనుంది. పండుగ షాపింగ్ కోసం సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 24 వరకు తేదీల్లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించబోతున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్‌లోకి జపాన్ సాఫ్ట్‌బ్యాంకు గ్రూప్ కార్పొరేషన్ నుంచి 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే.