ఫ్లిప్‌కార్ట్‌  'ది బిగ్ బిలియన్ డేస్‌ సేల్' ఆఫర్లు | Flipkart Big Billion Days 2019: 29th Sep to 4th Oct | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌  'ది బిగ్ బిలియన్ డేస్‌ సేల్' ఆఫర్లు

Published Fri, Sep 27 2019 2:46 PM | Last Updated on Fri, Sep 27 2019 2:57 PM

Flipkart Big Billion Days 2019: 29th Sep to 4th Oct - Sakshi

సాక్షి, ముంబై: ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్  ఫెస్టివల్‌ సేల్‌కు మరోసారి తెరతీసింది.  'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్'  కోలాహలం సెప్టెంబర్ 29 న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ప్లస్‌ సభ్యుల కోసం 28, 29 తేదీల్లో ఉదయం  8 గంటలనుంచే  ఈ ఆఫర్‌ ముందస్తుగా అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ ఆరు రోజుల గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్  సేలక్ష వివిధ గృహోపరకరణాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లపై భారీ అఫర్లను (90శాతం)  అందిస్తోంది. రియల్‌మి, ఆసుస్, గూగుల్, లెనోవా మోటరోలా, వివో, మోటో జీ7, మోటరోలా వన్‌విజన్‌, లెనోవా జెడ్‌ 6ప్రొ, కే10 నోట్‌​ ,తదితర డివైస్‌ల పై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది.  అలాగే శాంసంగ్‌  గెలాక్సీ ఎస్‌ 9 ప్లస్‌  కూడా తగ్గింపు ధరలో  అందిస్తోంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే కాకుండా మిడ్-రేంజ్‌, ప్రీమియం వాటికి కూడా వర్తిస్తుంది. అలాగే యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు  క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్‌ అదనం. రూ.2,000  ఎక్స్చేంజ్ తోపాటు మొబైల్ ప్రొటెక్షన్ లాంటి ఆఫర్లుకూడా ఉన్నాయి. 

 'ది బిగ్ బిలియన్ డేస్‌ సేల్' ఆఫర్లు
లెనోవో జెడ్‌ 6 ప్రొ  2 వేలు తగ్గింపుతో రూ. 31,999 లకే అందుబాటులోఉండనుంది
లెనోవో ఏ 6 నోట్‌పై వెయ్యిరూపాయల తగ్గింపు 
రియల్‌మి 5 ప్రో -1,000 రూపాయల తగ్గింపు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. 

ఇంకా రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లలోని రియల్‌మి 5, రియల్‌మి ఎక్స్‌టి, రియల్‌మి ఎక్స్‌, రియల్‌మి 3ఐను వరుసగా  రూ. 8,999, రూ. 15,999, రూ. 15,999, 7,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-సెగ్మెంట్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్  రియల్‌మి 5 (క్వాడ్-కెమెరా)  రూ 2 వేల తగ్గింపుతో రూ. 8,999లకే పొందవచ్చు.   మిగిలిన వివరాలు ఫ్లిప్‌కార్ట్‌  అధికారిక వెబ్‌సైట్‌లో చూడగలరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement