smart phones sales
-
1.5 లక్షల మొబైల్ రిటైలర్ల భవిష్యత్తు అయోమయం
కోల్‌కతా: ఈ కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణలు, అనైతిక విధానాలతో దేశవ్యాప్తంగా 1.5 లక్షల స్మార్ట్ ఫోన్ రిటైల్ దుకాణాదారుల భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టు అఖిల భారత మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్ఏ) పేర్కొంది. ఈ పరిస్థితుల్లో రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఈ కామర్స్ సంస్థల అనైతిక ధోరణులకు చెక్ పెట్టాలని కోరింది. చిన్న రిటైలర్లు నిలదొక్కుకోవడం కష్టం ‘‘ఆన్లైన్ విక్రయ సంస్థలు అనుసరిస్తున్న అనైతిక, వివక్షాపూరిత, గుత్తాధిపత్య వ్యాపార విధానాల వల్ల పరిస్థితి ఎంతో దిగజారింది. కొన్ని రిటైల్ షాపులు మూతపడ్డాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టెక్నాలజీ దన్నుతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనుసరిస్తున్న అనైతిక, గుత్తాధిపత్య విధానాలతో పోటీపడలేకపోతున్న 1,50,000 రిటైలర్లను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం’’ అని ఏఐఎంఆర్ఏ పశ్చిమబెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ బజోరియా తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి రెండు రోజుల పాటు వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులో కార్యాచరణపై ప్రణాళిక రూపొందించుకుంటామని తెలిపారు. ‘‘38 బిలియన్ డాలర్ల (రూ.2.85 లక్షల కోట్లు)తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న మొబైల్ ఫోన్ మార్కెట్. కొన్ని అంతర్జాతీయ మొబైల్ ఫోన్ కంపెనీలు 2021లో భారత్‌కు అత్యధికంగా ఫోన్లను ఎగుమతి చేశాయి. దేశ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ వాటా 50 శాతంగా ఉంది’’అని బజోరియా చెప్పారు. చిన్న మొబైల్ రిటైలర్లకు జీఎస్టీ ఇబ్బందికరంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పెద్ద రిటైలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తూ, చిన్న రిటైలర్లకు ముప్పుగా పరిణమించే వాతావరణం దేశంలో నెలకొందన్నారు. -
ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్!!
మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.16,099 ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.3,099కే అందిస్తున్నట్లు తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ మార్చి 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహిస్తుంది. అంతకంటే ముందే రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేయోచ్చని తెలిపింది. రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్‌పై ఆఫర్లు దేశీయ మార్కెట్ ప్రకారం..4జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ధర రూ.16,099గా ఉంది. అయితే కొనుగోలు దారులు అతితక్కువ ధరకే సొంతం చేసుకునేలా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఫోన్ ధర ప్రస్తుతం మార్కెట్ ధర కంటే భారీగా తగ్గనుంది. కొనుగోలు దారులు రియల్ మీ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌తో ఫోన్ ధర వెయ్యి తగ్గుతుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 15,099 ధరకు అందుబాటులోకి వస్తుంది.ఇక మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.13000 డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా మీ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ ఉంటే.. రియల్ మీ రూ.3వేలకే పొందవచ్చు. చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..! -
ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు, లిస్ట్‌లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి!
మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయడం లేదా?. ఇటీవల వాట్సాప్ తన ఓస్(ఆపరేటింగ్ సాఫ్ట్వేర్)ను అప్డేట్ చేసింది. దీంతో పాత ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఐఫోన్లు సైతం పనిచేయడం లేదు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొన్ని రిపోర్ట్లు ప్రకారం..బ్రెజిల్లో 100 మిలియన్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 30 రకాల స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం రిపోర్ట్లు పేర్కొన్నాయి. వాటిలో శాంసంగ్ గెలాక్సీ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్, హెచ్‌టీసీ డిజైర్ 500, సోనీ ఎక్స్‌పీరియా ఎం, ఎల్జీ ఆప్టిమస్ ఎఫ్7 ఫోన్ ఉన్నాయి. అయితే ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి కారణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయకపోవడమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. జనవరి 2022 నుంచి 30 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయడం లేదని స్ప్రౌట్ వైర్డ్ తన నివేదికలో పేర్కొంది. కాగా, ఇటీవల కాలంలో భారీగా అమ్ముడైన పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచి పోయాయి. వాట్సాప్ అప్డేట్ ఆండ్రాయిడ్ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్ కంటే తక్కువ ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇక ఐఫోన్లలో ఐఎస్ఎస్ 9 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఐఫోన్లలో మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోల్ని ఫార్వర్డ్ చేయలేమని Apple iPhone SE (16GB, 32 GB, and 64GB) Apple iPhone 6S (32GB and 64GB) Apple iPhone 6S Plus (16GB, 32GB, 64GB, and 128 GB) Apple iPhone 6S (128 GB) Apple iPhone 6s (16gb) Mini Samsung Galaxy S3 Samsung galaxy Ace 2 Samsung galaxy core Samsung Galaxy Trend II Samsung galaxy trend lite Samsung Galaxy Xcover 2 LG Act LG Lucid 2 LG Optimus F3 LG Optimus F3Q LG Optimus F5 LG Optimus F6 LG Optimus F7 LG Optimus L2 II LG Optimus L3 II LG Optimus L3 II Dual LG Optimus L4 II LG Optimus L4 II Dual LG Optimus L5 II LG Optimus L5 II Dual LG Optimus L7 II LG Optimus L7 II Dual Archos 53 Platinum Caterpillar Cat B15 Faea F1 HTC Desire 500 Huawei Ascend D2 Huawei Ascend G740 Huawei Ascend Mate Lenovo A820 Sony Xperia M THL W8 Vico darkknight Vico sync five ZTE Grand Memo ZTE Grand S Flex ZTE grand x quad v987 ZTE V956 – UMI X2 చదవండి: వాట్సాప్‌లో యూపీఐ పిన్ మార్చడం ఎలానో తెలుసా..? -
జస్ట్ మూడేళ్ల కంపెనీ..! 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీ.!
ప్రపంచవ్యాప్తంగా 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటికే దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టాయి. 5జీ స్మార్ట్ఫోన్లలో యాపిల్, శాంసంగ్, షావోమీ కంపెనీలకు మూడేళ్ల కంపెనీ రియల్మీ గట్టి పోటీనిస్తోంది. 5జీ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి..! 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో రియల్మీ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్ దుమ్మురేపుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విశ్లేషణ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం... చైనీస్ బ్రాండ్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా రియల్మీ నిలుస్తోంది. రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ భారత్‌తో సహా, చైనా, యూరప్ మార్కెట్లలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోన్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 2021లో 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో గ్లోబల్ వృద్ధి రేటు 121 శాతం ఉంది. 2020తో పోలిస్తే... 2021గాను 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 831 శాతం వృద్ధిని రియల్మీ సాధించినట్లు తెలిపింది. తక్కువ ధరలు..! ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకు రావడంతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలే రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కీలక అంశంగా పనిచేసిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు. చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు! -
మరోసారి సంచలనం సృష్టించిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ మరో సంచలనాన్ని సృష్టించింది. 2021 జూన్ నెలలో మొట్టమొదటి సారిగా ప్రపంచంలోనే నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షావోమీ నిలిచింది. ఈ ఏడాది జూన్ మాసంలో షావోమీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్ఫోన్లను విక్రయించింది. డేటా పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం ఆఫ్రికా, చైనా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను విస్తరించడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. షావోమీ సంస్థను 2010లో స్థాపించగా కంపెనీ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ను 2011 సంవత్సరంలో విడుదల చేసింది. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా షావోమీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. షావోమీ అమ్మకాలు మే నెలతో పోలిస్తే జూన్ నెలలో గణనీయంగా 26 శాతం పెరిగాయి. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పరంగా షావోమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు 17.1 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. షావోమీ బ్రాండ్ తరువాత ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 15.7 శాతం, ఆపిల్ 14.3 శాతం వాటాలను సొంతం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలు జరిపిన రెండో బ్రాండ్‌గా షావోమీ నిలిచింది. షావోమీ ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఆఫ్రికా, చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో హువావే స్మార్ట్‌ఫోన్ వెనక్కి తగ్గడంతో ఆ గ్యాప్‌ను షావోమీ భర్తీ చేసిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ పాఠఖ్ వెల్లడించారు. జూన్ నెలలో చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్, భారత మార్కెట్లలో షావోమీ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వియత్నాంలో కోవిడ్-19 వేవ్ రాకతో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి కూడా దెబ్బతింది. ఈ కారణంగానే శాంసంగ్ వెనుకబడి ఉండవచ్చునని కౌంటర్‌పాయింట్ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. -
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా రెడ్మీ
-
సంచలనం:యాపిల్‌ను వెనక్కి నెట్టిన షియోమీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ సంచలనం సృష్టించిది. యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా నిలిచింది. ఇక ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇప్పుడు శాంసంగ్ టాప్ పొజిషన్‌కు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ canalys నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 19 శాతం షేర్లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ టాప్ పొజిషన్లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటిదాకా శాంసంగ్, యాపిల్ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ వచ్చేవి. ఫస్ట్ టైం షియోమీ రెండో ప్లేస్‌కు చేరి ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ పెట్టింది. హువాయ్ పతనం తర్వాత మిగతా ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ గ్యాప్‌ను పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్ దేశాలకు 300 శాతం కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్ ఎగుమతులు వెళ్లాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్ పెరిగిందని.. అదే టైంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే షియోమీ నెంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం యాపిల్‌కు 14 శాతం షేర్ ఉండగా, ఒప్పో.. వివోలు చెరో పదిశాతం మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. -
Realme: ఎన్నో ఫీచర్లు, ధర ఇంత తక్కువా?!
సాక్షి,వెబ్ డెస్క్: కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న స్మార్ట్ మార్కెట్ జోరందుకుంది. దేశంలో అన్‌లాక్‌తో ఆయా సంస్థలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు సందడి చేస్తుండగా మరికొద్దిరోజుల్లో రియల్ మీకి రియల్-మి నార్జ్30 5జీ, నార్జో30 4జీ స్టార్ట్ఫోన్లతోపాటు, బడ్స్ క్యూ2, 32 అంగుళాల స్మార్ట్ టీవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిసారి రియల్ మీ మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంది. కానీ తాజాగా రియల్ మీ నార్జో30 సిరీస్ లోని నార్జో30 ప్రో, నార్జో30 ఎ అనే రెండు మోడళ్లు స్మార్ట్ ప్రియుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని రియల్-మి ఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేథ్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ నార్జో 30ప్రో, నార్జో30 ఏ స్మార్ట్ ఫోన్లు మలేషియాలో రేసింగ్ బ్లూ, రేసింగ్ బ్లాక్ కలర్స్ లో విడుదలయ్యాయి. రియల్ మీ నార్జో30 5జిస్పెసిఫికేషన్లు స్పెసిఫికేషన్ల వారీగా రియల్మే నార్జో30 5జి, నార్జో30 4జి చిప్సెట్, ఇతర చిన్న స్పెసిఫికేషన్లు మినహాయిస్తే మిగిలిన ఫీచర్స్ అన్నీ ఒకేలా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రియల్మీ నార్జో30 5జి ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ధర: 799 మలేషియన్ రింగెట్లుగా(సుమారు రూ.14,100) నిర్ణయించారు. భారత్ లో సైతం కాస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చనే అంచనా. నార్జో30 4జి స్పెసిఫికేషన్లు నార్జో30 4జి లో మీడియాటెక్ హెలియో జి 95 చిప్సెట్ ఉంటుంది. ఈ రెండు ఫోన్లు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్ నెస్ ను అందిస్తాయి. 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ క్వాలీటీ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫోన్ పై భాగంలో ఎడమ వైపు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఫోన్ ఆండ్రాయిడ్ 11కు చెందిన రియల్మీ యుఐ 2.0తో పనిచేస్తుంది. రియల్ మీ నార్జో30 5జి స్పెసిఫికేషన్లు రియల్ మీ నార్జో30 5జిలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ చిన్న కెమెరాలు, బ్లాక్ అండ్ వైట్ 2 మెగాపిక్సెల్ ఉన్నాయి. మీరు ఫోన్లో నైట్స్కేప్ మోడ్, ఏఐని ఆపరేట్ చేయవచ్చు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అదే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న 4జి వేరియంట్లో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ను వినియోగించుకోవచ్చు. రియల్ మీ బడ్స్ క్యూ2 స్మార్ట్ టీవీ ఫీచర్స్ రియల్ మీ అధికారిక వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం... రియల్ మీ బడ్స్ క్యూ2.. రియల్ మీ బడ్స్2 నియో లాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాకపోతే బడ్స్ క్యూ 2 యాక్టీవ్ సౌండ్స్‌ను కంట్రోల్ చేస్తే బడ్స్2 బయట నుంచి వచ్చే సౌండ్ ను కంట్రోల్ చేయగలదు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ పూర్తి హెచ్డి రిజల్యూషన్, ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రాబోతోంది. ప్రస్తుతానికి దీని ధర మాత్రం అందుబాటులో లేదు. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ వచ్చేశాయి.. మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!
సాక్షి, ముంబై: కొత్తగా మొబైల్ ఫోన్లను కొనేవారికి శుభవార్త. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో వినియోగదారులకు ప్రత్యేక సేల్‌ను నిర్వహించనుంది. ఈ నెల 13 నుంచి 16 వరకు సేల్ కొనసాగనుంది. కాగా ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను వినియోగదారులకు అందించనుంది. ప్రముఖ కంపెనీల మొబైల్ ఫోన్లు ఈ సేల్‌లో భారీగా తగ్గనున్నాయి. గూగుల్ పిక్సెల్, ఐఫోన్, ఆసుస్, శాంసంగ్ గెలాక్సీ తదితర ఫోన్ల ఆఫర్ ధరలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందుగానే జూన్ 12 అర్ధరాత్రి నుంచే బిగ్ సేవింగ్ డేస్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్లతో పాటుగా ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై 80 శాతం వరకు, స్మార్ట్ వాచ్‌లపై 60 శాతం వరకు, టాబ్లెట్లపై 50 శాతం వరకు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లపై సుమారు 30శాతం వరకు డిస్కౌంట్లను అందించనున్నాయి. మొబైల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్లు ఇవే మొబైల్ ఫోన్ అసలు ధర ఆఫర్ ధర గూగుల్ పిక్సెల్ 36,250 26,999 ఐఫోన్ 11 ప్రో 79, 899 74,999 మోటోరొలా రేజర్ 5జీ 1,09,999 89,999 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 10,999 9999 ఆసుస్ రాగ్ ఫోన్ 3 46,999 41,999 ఐఫోన్ ఎక్స్ ఆర్ 41,999 39,999 వీటితో పాటుగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ ఫోన్స్ జియోనీ మ్యాక్స్ ప్రో, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందించనున్నాయి. అంతేకాకుండా ఎస్బీఐ కార్డు ద్వారా షాపింగ్ చేసే వినియోగదారులకు పది శాతం ఇన్స్టాంట్ తగ్గింపును అందించనుంది. -
రికార్డు స్మార్ట్ఫోన్లు విక్రయం : టాప్‌లో షావోమి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గత సంవత్సరం 15 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 4 శాతం తక్కువ అని పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. కోవిడ్-19 విస్తృతి నేపథ్యంలో గతేడాది ఈ స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం విశేషం. లాక్డౌన్ తదనంతరం అధిక డిమాండ్ పెరగడం, ఇంటి నుంచి పని, ఆన్లైన్ క్లాసులు.. వెరసిఈ స్థాయి అమ్మకాలు సాధ్యమయ్యాయి. అయితే 2020 అక్టోబరు–డిసెంబరు కాలంలో స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 19 శాతం అధికంగా జరగడం ఇక్కడ గమనార్హం. అయితే స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో కలిపి మొత్తం మొబైల్స్ మార్కెట్ గతేడాది 9 శాతం తగ్గింది. 2019తో పోలిస్తే గత సంవత్సరంలో భారత్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2 శాతం తగ్గి 14.5 కోట్ల యూనిట్లు నమోదయ్యాయని మరో పరిశోధన సంస్థ కెనాలిస్ వెల్లడించింది. తొలి స్థానంలో షావొమీ.. స్మార్ట్‌ఫోన్స్ సేల్స్‌లో షావొమీ దేశంలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 2020తోపాటు నాల్గవ త్రైమాసికంలోనూ 26 శాతం మార్కెట్ వాటాను ఈ కంపెనీ సొంతం చేసుకుంది. గతేడాది అక్టోబరు–డిసెంబరు కాలంలో 21 శాతం వాటాతో సామ్సంగ్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది. వివో-16 శాతం, రియల్మీ-13, ఒప్పో 10శాతం వాటా దక్కించు కున్నాయి. 2020లో ఇదే స్థాయిలో మార్కెట్ వాటాను వివో, రియల్మీ, ఒప్పో చేజిక్కించుకోగా, సామ్సంగ్ 20 శాతానికి పరిమితమైంది. డిసెంబరు క్వార్టర్లో వన్‌ప్లస్ 200 శాతం వృద్ధి సాధించింది. నార్డ్ సిరీస్, 8టీ సిరీస్ ఇందుకు దోహదం చేశాయి. ట్రాన్సన్ గ్రూప్ బ్రాండ్స్ అయిన ఐటెల్, ఇన్ఫినిక్స్, టెక్నో ఇప్పటి వరకు అత్యధికంగా 90 లక్షల యూనిట్లను నాల్గవ త్రైమాసికంలో విక్రయించాయి. కొత్త రికార్డులతో యాపిల్.. ఆరవ స్థానంలో ఉన్న యాపిల్ అంత క్రితం ఏడాదితో పోలిస్తే నాల్గవ త్రైమాసికంలో 171 శాతం, 2020లో 93 శాతం వృద్ధి సాధించింది. ఐఫోన్ 12 అందుబాటులోకి రావడం, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11లపై ఆఫర్లకుతోడు ఆన్లైన్ విస్తరణ కారణంగా ఈ స్థాయి పనితీరు కనబరిచింది. డిసెంబరు త్రైమాసికంలో 15 లక్షల యూనిట్లను యాపిల్ విక్రయించింది. ఇంత మొత్తంలో ఒక త్రైమాసికంలో అమ్మకాలు సాధించడం యాపిల్‌కు ఇదే తొలిసారి. ఫీచర్ ఫోన్ల నుంచి.. మూడవ త్రైమాసికంలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదైన తర్వాత అదే ఊపును డిసెంబరు క్వార్టర్లోనూ మార్కెట్ కొనసాగించిందని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ సీనియర్ అనలిస్ట్ ప్రచిర్ సింగ్ తెలిపారు. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. ఫీచర్ ఫోన్ల విక్రయాలు 2020లో 20 శాతం తగ్గాయి. ఆధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. కోవిడ్–19 ఉన్నప్పటికీ 15 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవడం రికార్డుగానే భావించాలని టెక్నోవిజన్ ఎండీ సికందర్ అన్నారు. ప్రధానంగా ఆన్లైన్ క్లాసులు పరిశ్రమను నడిపించాయని చెప్పారు. అయితే 2021లో భారతీయ బ్రాండ్లకు కలిసి వస్తుందని కౌంటర్‌పాయింట్ చెబుతోంది. కొత్త టెక్నాలజీకి సై.. గతేడాది దేశవ్యాప్తంగా 5జీ స్మార్ట్ఫోన్లు 40 లక్షల యూనిట్లు దాటాయి. వన్‌ప్లస్, యాపిల్ బ్రాండ్లు ఈ విభాగాన్ని నడిపించాయి. వన్‌ప్లస్ మోడల్స్ అన్నీ 5జీ టెక్నాలజీతోనే వస్తున్నాయి. 2021లో 3.8 కోట్ల 5జీ మోడల్స్ అమ్ముడవుతాయని కౌంటర్‌పాయింట్ అంచనా వేస్తోంది. కాగా, చైనా బ్రాండ్ల వాటా దేశంలో 75 శాతానికి చేరింది. సామ్సంగ్, వివో, ఒప్పో బ్రాండ్లు ఆన్లైన్ మార్కెట్‌పై పెద్ద ఎత్తున ఫోకస్ చేశాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందుకోవడం ద్వారా దేశీయ బ్రాండ్లు తమ వాటాను పెంచుకోవాలని చూస్తున్నాయి. -
స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో షావోమి దూకుడు
న్యూఢిల్లీ: చైనా కంపెనీ షావోమీకి చెందిన ఎంఐ ఇండియా గత వారం పండుగ అమ్మకాల్లో భాగంగా 50 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఈ నెల 16 నుంచి 22 వరకు పండుగల ప్రత్యేక అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘‘ఎంఐ అభిమానులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ను పండుగల తగ్గింపులు, ఆఫర్లను ఉపయోగించుకుని 15,000కుపైగా రిటైల్ భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోగలిగారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోర్టళ్లతోపాటు ఎంఐ డాట్ కామ్ సాయంతో దేశవ్యాప్తంగా 17వేల పిన్కోడ్ల పరిధిలోని కస్టమర్లను చేరుకోగలిగినట్టు’’ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ డేస్ సేల్ లో భాగంగా పలు మొబైళ్లపై తగ్గింపు ధరలను సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా గెలాక్సీ నోట్ 20పై 9 వేల రూపాయల పరిమితకాల తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు 6,000క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ తోపాటు, ప్రముఖ ఆన్లైన్ పోర్టల్స్ ,రిటైల్ స్టోర్లలో ఈ తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు శాంసంగ్ ఇతర గెలాక్సీ ఫోన్లపై కూడా తగ్గింపు అఫర్లను అందుబాటులో ఉంచింది. గెలాక్సీ నోట్ 20 లాంచింగ్ ధర 77,999 రూపాయలు. సేల్ ధర 68,999 రూపాయలు. ఒకవేళ హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో ఆరువేల తగ్గింపు. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను 62,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ బ్లూ రంగులలో ఇది లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫీచర్లు 6.70 అంగుళాల హెచ్డి ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ + ఫ్లాట్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజట్యూషన్ ఆండ్రాయిడ్ 10 శాంసంగ్ ఎక్సినోస్ 990ప్రాసెసర్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 12+64+12మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 4300 ఎంఏహెచ్ బ్యాటరీ -
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, భారీ తగ్గింపు
సాక్షి, ముంబై : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించింది. నేటి (బుధవారం)నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. దీనికి ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ప్రధానంగా శాంసంగ్, షావోమి, రియల్‌మి, ఆపిల్, వన్‌ప్లస్ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయచ్చు. ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.3వేల తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్మి కే2 ప్రొ తోపాటు, ఐఫోన్ 11 ప్రొ, ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది అమెజాన్. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 : బెస్ట్ డీల్స్ వన్‌ప్లస్ 7 టీ (8 జీబీ, 128 జీబీ) ధర: రూ. 34,999 అసలు ధర. రూ .37,999 ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ : రూ. 32,990. అసలు ధర రూ. 55,990 వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ కూ. 42,999 అసలు ధర 52,999 వన్‌ప్లస్ 7 ప్రో (నెబ్యులా బ్లూ 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్) రూ. 42,999 (18శాతం తగ్గింపు) శాంసంగ్ గెలాక్సీ ఎం 30 4 జీబీ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ రూ. 11,999 అసలు ధర రూ. 16,490 -
ఫ్లిప్‌కార్ట్ 'ది బిగ్ బిలియన్ డేస్ సేల్' ఆఫర్లు
సాక్షి, ముంబై: ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్కు మరోసారి తెరతీసింది. 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్' కోలాహలం సెప్టెంబర్ 29 న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ప్లస్ సభ్యుల కోసం 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలనుంచే ఈ ఆఫర్ ముందస్తుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆరు రోజుల గ్రాండ్ షాపింగ్ ఫెస్టివల్ సేలక్ష వివిధ గృహోపరకరణాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లపై భారీ అఫర్లను (90శాతం) అందిస్తోంది. రియల్‌మి, ఆసుస్, గూగుల్, లెనోవా మోటరోలా, వివో, మోటో జీ7, మోటరోలా వన్‌విజన్, లెనోవా జెడ్ 6ప్రొ, కే10 నోట్ ,తదితర డివైస్ల పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 ప్లస్ కూడా తగ్గింపు ధరలో అందిస్తోంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు మాత్రమే కాకుండా మిడ్-రేంజ్, ప్రీమియం వాటికి కూడా వర్తిస్తుంది. అలాగే యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోళ్లపై 10శాతం డిస్కౌంట్ అదనం. రూ.2,000 ఎక్స్చేంజ్ తోపాటు మొబైల్ ప్రొటెక్షన్ లాంటి ఆఫర్లుకూడా ఉన్నాయి. 'ది బిగ్ బిలియన్ డేస్ సేల్' ఆఫర్లు లెనోవో జెడ్ 6 ప్రొ 2 వేలు తగ్గింపుతో రూ. 31,999 లకే అందుబాటులోఉండనుంది లెనోవో ఏ 6 నోట్‌పై వెయ్యిరూపాయల తగ్గింపు రియల్‌మి 5 ప్రో -1,000 రూపాయల తగ్గింపు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ.1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇంకా రియల్‌మి స్మార్ట్ఫోన్లలోని రియల్‌మి 5, రియల్‌మి ఎక్స్‌టి, రియల్‌మి ఎక్స్, రియల్‌మి 3ఐను వరుసగా రూ. 8,999, రూ. 15,999, రూ. 15,999, 7,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-సెగ్మెంట్ రియల్‌మి స్మార్ట్‌ఫోన్ రియల్‌మి 5 (క్వాడ్-కెమెరా) రూ 2 వేల తగ్గింపుతో రూ. 8,999లకే పొందవచ్చు. మిగిలిన వివరాలు ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్సైట్లో చూడగలరు. -
రెడ్మి నోట్ 6 ప్రో వన్ డే స్పెషల్ ఆఫర్
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి తాజా స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 6 ప్రో మరోసారి విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్న రెడ్మి నోట్ 6ప్రో వన్ డే స్పెషల్ ఆఫర్ పేరుతో వినియోగదారులకు లభిస్తోంది. ఈ రోజు (డిసెంబర్ 5) మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎమ్ఐ డాట్ కామ్‌లలో సేల్ ప్రారంభం. హెచ్డీఎఫ్సీ కార్డుల నుంచి కొనుగోలు చేస్తే మరో రూ. 500 క్యాష్‌బ్యాక్ లభించనుంది. ప్రారంభ ధర 13,999గా ఉండనుంది. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
40 శాతం తగ్గిన శామ్సంగ్ లాభం
సియోల్ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ కంపెనీ నికర లాభం ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 40 శాతం తగ్గింది. వినియోగదారులు పెద్ద సైజు యాపిల్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం, చైనా కంపెనీల నుంచి పోటీ అంతకంతకూ పెరిగిపోవడం, దక్షిణ కొరియా కరెన్సీ వాన్ బలపడడం దీనికి ప్రధాన కారణాలు. దక్షిణ కొరియా కరెన్సీ వాన్ బలపడడం వల్ల విదేశీ మార్కెట్లలో శామ్సంగ్ ఉత్పత్తులు ఎక్కువ ఖరీదు పలుకుతున్నాయి. దీంతో అమ్మకాలు తగ్గుతున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో కంపెనీ నికర అదాయం 420 కోట్ల డాలర్లకు తగ్గింది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో యాపిల్, చైనా కంపెనీల పోటీ కారణంగా శామ్సంగ్ కంపెనీ లాభదాయకత తగ్గిపోయింది. కాగా కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఎస్6 స్మార్ట్ఫోన్లు మంచి అమ్మకాలు సాధిస్తున్నాయి.