ప్రపంచవ్యాప్తంగా 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటికే దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టాయి. 5జీ స్మార్ట్‌ఫోన్లలో యాపిల్, శాంసంగ్, షావోమీ కంపెనీలకు మూడేళ్ల కంపెనీ రియల్‌మీ గట్టి పోటీనిస్తోంది.
5జీ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి..!
5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో రియల్‌మీ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్ దుమ్మురేపుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విశ్లేషణ సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం... చైనీస్ బ్రాండ్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా రియల్‌మీ నిలుస్తోంది.
రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ భారత్‌తో సహా, చైనా, యూరప్ మార్కెట్లలో గణనీయమైన వృద్ధిని సాధిస్తోన్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 2021లో 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో గ్లోబల్ వృద్ధి రేటు 121 శాతం ఉంది. 2020తో పోలిస్తే... 2021గాను 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 831 శాతం వృద్ధిని రియల్‌మీ సాధించినట్లు తెలిపింది.
తక్కువ ధరలు..!
ఇతర 5జీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పోలిస్తే రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకు రావడంతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలే రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కీలక అంశంగా పనిచేసిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు.
చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment