సాక్షి, ముంబై : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించింది. నేటి (బుధవారం)నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. దీనికి ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ప్రధానంగా శాంసంగ్, షావోమి, రియల్‌మి, ఆపిల్, వన్‌ప్లస్ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయచ్చు. ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.3వేల తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్‌మి కే2 ప్రొ తోపాటు, ఐఫోన్ 11 ప్రొ, ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది అమెజాన్.
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 : బెస్ట్ డీల్స్
వన్‌ప్లస్ 7 టీ (8 జీబీ, 128 జీబీ) ధర: రూ. 34,999 అసలు ధర. రూ .37,999
ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ : రూ. 32,990. అసలు ధర రూ. 55,990
వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ కూ. 42,999 అసలు ధర 52,999
వన్‌ప్లస్ 7 ప్రో (నెబ్యులా బ్లూ 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్) రూ. 42,999 (18శాతం తగ్గింపు)
శాంసంగ్ గెలాక్సీ ఎం 30 4 జీబీ ర్యామ్, 64 జిబి స్టోరేజ్ రూ. 11,999 అసలు ధర రూ. 16,490
Comments
Please login to add a commentAdd a comment