![Xiaomi Leads Smartphones Sales in India - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/24/Xiaomi.jpg.webp?itok=bX72BBkZ)
న్యూఢిల్లీ: చైనా కంపెనీ షావోమీకి చెందిన ఎంఐ ఇండియా గత వారం పండుగ అమ్మకాల్లో భాగంగా 50 లక్షల స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఈ నెల 16 నుంచి 22 వరకు పండుగల ప్రత్యేక అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘‘ఎంఐ అభిమానులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ను పండుగల తగ్గింపులు, ఆఫర్లను ఉపయోగించుకుని 15,000కుపైగా రిటైల్ భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోగలిగారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోర్టళ్లతోపాటు ఎంఐ డాట్ కామ్ సాయంతో దేశవ్యాప్తంగా 17వేల పిన్‌కోడ్‌ల పరిధిలోని కస్టమర్లను చేరుకోగలిగినట్టు’’ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment