I Phone SE 2020 Available For As Low As Rs 18,000 On Flipkart - Sakshi
Sakshi News home page

Flipkart Big Billion Days: బంపర్‌ ఆఫర్‌, రూ.18,499 తగ్గనున్న ఐఫోన్‌ ధర

Published Thu, Sep 30 2021 12:19 PM | Last Updated on Thu, Sep 30 2021 4:24 PM

iPhone SE 2020 Available for as Low as Rs 18 000 on Flipkart - Sakshi

ఐఫోన్‌ లవర్స్‌కు ఫ్లిప్‌ కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 3 నుంచి 10 జరగనున్న బిగ్‌ బిలియన్‌ డే సేల్స్‌లో ఆపిల్‌ ప్రాడక్ట్‌పై భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. గతేడాది ఆపిల్‌ విడుదల చేసిన ఐఫోన్‌ ఎస్‌ఈ సిరీస్‌ 64జీబీ మోడల్‌ ధర రూ.39,900 ఉండగా, డిస్కౌంట్‌లో రూ.25,999కే అందిస్తుంది.

 
యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ ఫీచర్స్‌ 
ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్స్‌లో అమ్మకానికి సిద్ధంగా యాపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ ఫోన్‌ ఐఓఎస్‌15కి అప్‌ డేట్‌ అవ్వొచ్చు. 4.7 అంగుళాలు, రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే, యాంబినెట్‌ లైటింగ్‌, హెచ్‌డీఆర్‌ 10 కాంపర్ట్‌బులిటీతో డాల్బీ విజన్‌,ఆపిల్ ఏ13 బయోనిక్ చిప్‌, యాపిల్‌ ఐఫోన్‌ 11 లైనప్‌, ఏ13 బయోనిక్‌లో సెకను వ్యవధిలో ట్రిలియన్‌ కార్యకాలపాల్ని చేసే సామర్ధ్యం, 8-కోర్ న్యూరల్ ఇంజిన్, సీపీయూలో రెండు మెషిన్ లెర్నింగ్ యాక్సిలరేటర్లతో పాటు కొత్తగా మెషిన్ లెర్నింగ్ కంట్రోలర్లు కూడా ఉన్నాయి. 18వాల్ట్‌ల వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. 


డెబిట్‌ కార్ట్‌, క్రెడిట్‌ కార్డ్‌లపై ఆఫర్‌ 
ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 5,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ .1500 వరకు క్యాష్‌బ్యాక్  పొందవచ్చు. అదే బ్యాంకు డెబిట్ కార్డు వినియోగదారులు రూ .1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఫోన్‌లపై రూ.15,000 వరకు ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 7 (పని తీరును బట్టి ) ఎక్ఛేంజ్‌లో సుమారు రూ. 6,000, అదనపు బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.18,499 తగ్గుతుంది. ఇక ఎక్ఛేంజ్ ఆఫర్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 7 బ్లాక్, రెడ్,వైట్ కలర్‌లలో అందుబాటులో ఉండనున్నాయి.

చదవండి:నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్‌- ఫ్లిప్‌కార్ట్‌...! కస్టమర్లకు మాత్రం పండగే...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement