IPhone -7
-
ఇప్పటివరకు విడుదలైన అన్ని ఐఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
బంపర్ ఆఫర్, రూ.18,499 తగ్గనున్న ఐఫోన్ ధర
ఐఫోన్ లవర్స్‌కు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 10 జరగనున్న బిగ్ బిలియన్ డే సేల్స్‌లో ఆపిల్ ప్రాడక్ట్‌పై భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది. గతేడాది ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ ఎస్ఈ సిరీస్ 64జీబీ మోడల్ ధర రూ.39,900 ఉండగా, డిస్కౌంట్లో రూ.25,999కే అందిస్తుంది. యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ఫీచర్స్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్‌లో అమ్మకానికి సిద్ధంగా యాపిల్ ఐఫోన్ ఎస్ఈ ఫోన్ ఐఓఎస్15కి అప్ డేట్ అవ్వొచ్చు. 4.7 అంగుళాలు, రెటీనా హెచ్డీ డిస్ప్లే, యాంబినెట్ లైటింగ్, హెచ్డీఆర్ 10 కాంపర్ట్బులిటీతో డాల్బీ విజన్,ఆపిల్ ఏ13 బయోనిక్ చిప్, యాపిల్ ఐఫోన్ 11 లైనప్, ఏ13 బయోనిక్‌లో సెకను వ్యవధిలో ట్రిలియన్ కార్యకాలపాల్ని చేసే సామర్ధ్యం, 8-కోర్ న్యూరల్ ఇంజిన్, సీపీయూలో రెండు మెషిన్ లెర్నింగ్ యాక్సిలరేటర్లతో పాటు కొత్తగా మెషిన్ లెర్నింగ్ కంట్రోలర్లు కూడా ఉన్నాయి. 18వాల్ట్‌ల వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. డెబిట్ కార్ట్, క్రెడిట్ కార్డ్‌లపై ఆఫర్ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 5,000 కంటే ఎక్కువ ఆర్డర్లపై రూ .1500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదే బ్యాంకు డెబిట్ కార్డు వినియోగదారులు రూ .1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఫోన్లపై రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 7 (పని తీరును బట్టి ) ఎక్ఛేంజ్‌లో సుమారు రూ. 6,000, అదనపు బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ ఎస్ఈ ధర రూ.18,499 తగ్గుతుంది. ఇక ఎక్ఛేంజ్ ఆఫర్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 7 బ్లాక్, రెడ్,వైట్ కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి. చదవండి:నువ్వా..! నేనా..! అన్నట్లుగా అమెజాన్- ఫ్లిప్‌కార్ట్...! కస్టమర్లకు మాత్రం పండగే...! -
ఢిల్లీ బీజేపీ చీఫ్‌కు చేదుఅనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : ‘అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు’ సామెత గుర్తుందికదా, దాదాపు అలాంటి చేదు అనుభవమే ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీకి ఎదురైంది. చైనా వస్తువుల వ్యతిరేక ర్యాలీకి వెళ్లిన ఆయన.. తన అమెరికా ఐఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఏం జరిగిందంటే.. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మత సంస్థ ఆర్ఎస్ఎస్ వాణిజ్య విభాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్ సోమవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఒక ర్యాలీని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి కూడా పాలుపంచుకున్నారు. సభ ముగిసిన అనంతరం ఆయన తన ఫోన్ పోయినట్లు గుర్తించారు. అది.. అమెరికాకు చెందిన ఆపిల్ సంస్థ తయారి ‘ఐఫోన్ సెవెన్ ప్లస్’, ధర సుమారు రూ.55 వేలు! అనుచరులతో ఎంత వెతికించినా లాభంలేకపోవడంతో చివరికి తివారీ కమలా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. తన ఐఫోన్ తస్కరణకు గురైందని ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఎంపీగారి ఫోన్ జాడను కనిపెట్టేపనిలో పడ్డారు. భోజ్‌పురి నటుడు, సంగీతకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న తివారీ.. 2014లో బీజేపీలో చేరి, ఈశాన్య ఢిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత డిసెంబర్ నుంచి బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
ఇండియాలో ఐఫోన్-7
నోయిడా: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రతిష్టాత్మకంగా గత నెల మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్-7 హ్యాండ్సెట్స్ ఎట్టకేలకు శుక్రవారం నుంచి భారతీయులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో లభ్యంకానున్న ఈ ఐఫోన్ మొబైళ్లను 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ అనే మూడు వేరియంట్లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్-7, 7 ప్లస్ హ్యాండ్సెట్స్ ప్రారంభ ధర రూ.60,000గా ఉంది. ఐఫోన్ యూజర్లకు జియో ఆఫర్ రిలయన్స్ జియో తాజాగా ఐఫోన్ యూజర్లకు ఒక ఆఫర్ ను ప్రకటించింది. రిలయన్స్ రిటైల్ లేదా యాపిల్ స్టోర్ నుంచి కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేసి జియో కనెక్షన్‌ను ఉపయోగిస్తున్న వారు ఈ ఏడాది 31 వరకు జియో వెల్కమ్ ఆఫర్‌ను ఉచితంగా పొం దొచ్చు. అటుపై అంటే జనవరి 1 నుంచి ఈ ఐఫోన్ యూజర్లందరికీ జియో కంపెనీ రూ.1,499 ప్లాన్‌ను ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాలింగ్, నేషనల్ రోమింగ్ వంటి ఈ సేవల విలువ రూ.18,000 వరకు ఉండొచ్చని అంచనా. మొదటి ఐఫోన్‌ను సొంతం చేసుకున్న యువతి