దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్‌ను ప్రకటించింది. దసర పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై తగ్గింపులతో పాటు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
గతేడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించింది. అలాగే ఈ ఏడాది సైతం ఈ సేల్ అదే సమయంలో ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పలు నివేదికల ప్రకారం..సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టత ఇవ్వాల్సి ఉండగా.. ఈ సేల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
బ్యాంక్ కార్డ్‌లపై ఆఫర్లు
8 రోజుల పాటు సుధీర్ఘంగా జరిగే ఈ ప్రత్యేక అమ్మకాల్లో ఈ కామర్స్ సంస్థ ఎప్పటి లాగే ఆఫర్లను అందించనుంది. ముఖ్యంగా ఐసిఐసిఐ, యాక్సిస్ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. కొనుగోళ్లను బట్టి డిస్కౌంట్ ఉంటుంది. దీంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ,ఎక్ఛేంజ్ ఆఫర్,ప్రిపెయిడ్ ఆఫర్స్ ఉన్నాయి.
ఐఫోన్ 14సైతం
వచ్చే నెల చివరిలో ప్రారంభయ్యే ఈ సేల్ 24 గంటల ముందే ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 అమ్మకాలు జరపనుంది. దీంతో పాటు మరో ఈ బుధవారం విడుదలయ్యే ఐఫోన్ 14సిరీస్ ఫోన్ సైతం అమ్మనుంది. వీటితో పాటు రియల్ మీ, పోకో, వివో,యాపిల్,శాంసంగ్ ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు ,టీవీలు, గృహోపరకరణలపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. సేల్ జరిగే 12ఏఎం, 8ఏఎం, 4పీఎం సమయంలో అదనపు డిస్కౌంట్‌లను సొంతం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment