ప్రముఖ రీటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీగా సీజనల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టింది. పండుగ సీజన్‌తో పాటు తన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఆఫర్ రోజుల సందర్భంగా నెలకొనే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 4 వేల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో వ్యక్తులు, సర్వీస్ ఏజెన్సీలు, టెక్నీషియన్లకు అవకాశాలను కల్పిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ ట్రా పేరుతో వారికి ఉద్యోగ అవకాశాలు సృష్టించింది. ఫెస్టివల్ సీజన్‌కు ముందు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా వినియోగదారులకు పండుగ అమ్మకాల సమయంలో అంతరాయం లేకుండా వేగంగా డెలివరీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇతర ఈ-కామర్స్ సంస్థలు భారీగా సేల్స్ తో ముందుకు వస్తాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి మరిన్ని కేటగిరీలపై డిస్కౌంట్లను అందిస్తాయి. ఆ డిమాండ్ కాలంలో వేగంగా డెలివరీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆన్ బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ ట్రా(Flipkart Xtra) పేరుతో ఒక స్టాండ్ ఎలోన్ యాప్ లాంఛ్ చేసింది. ఉద్యోగార్థుల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కొరకు ఈ యాప్ ఉపయోగించవచ్చు. వారు తమ విద్యార్హతలు, పని అనుభవం వంటి అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వ్యక్తులు, టెక్నీషియన్లు, సర్వీస్ ఏజెన్సీలకు స్వల్ప కాలం పని చేయడానికి ఈ కొత్త యాప్ సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment