
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద సేల్‌తో పండుగ సీజన్‌కు ఆహ్వానం పలుకబోతుంది. త్వరలోనే అతిపెద్ద బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించబోతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతీసారి 10 శాతం డిస్కౌంట్‌ను పొందుతున్నారు. ఈ సేల్‌ను ప్రమోట్ చేస్తూ.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ముందస్తు సేల్స్ కంటే ఈ సేల్ అతిపెద్దదిగా ఉండబోతున్నట్టు పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు, ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఫ్లాట్ డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది.
దీని కోసం ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఓ పేజీని కూడా కేటాయించింది. సేల్ ప్రారంభమయ్యే సమయంలోనే క్రెడిట్, డెబిట్ కార్డులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను కంపెనీ రివీల్ చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని మాత్రమే బహిర్గతం చేసింది. ఇతర బ్యాంకులపై కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను ప్రకటించబోతుంది. ప్రొడక్ట్‌లపై ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అదేవిధంగా గిఫ్ట్ కార్డులు అందుబాటులోకి రాబోతున్నాయి. బాలీవుడ్, క్రికెట్ స్టార్లు అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లి, దీపికా పదుకొణేలు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగం కాబోతున్నారు. ఈ సూపర్ స్టార్ల పాపులారిటీతో ప్రొడక్ట్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను, ప్రొడక్ట్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పుడు నిర్వహిస్తోందో ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. పండుగ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment