ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లపై భారీ తగ్గింపు...! | Iphone 12 Prices Drop On Flipkart Ahead Of Iphone 13 Launch | Sakshi
Sakshi News home page

Apple: ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లపై భారీ తగ్గింపు...!

Published Sun, Sep 12 2021 8:22 PM | Last Updated on Mon, Sep 20 2021 12:06 PM

Iphone 12 Prices Drop On Flipkart Ahead Of Iphone 13 Launch - Sakshi

iPhone 12 Series: సెప్టెంబర్‌ 14న ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేయడానికి ఆపిల్‌ సన్నాద్ధం అవుతోంది. ఐఫోన్‌-13 ను లాంచ్‌ చేస్తున్న నేపథ్యంలో ఐఫోన్‌-12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపును ప్రకటించింది.ఫ్లిప్‌కార్ట్‌ పలు ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లపై సుమారు రూ. 12 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్‌ 12 మినీ 64జీబీ, 128జీబీ వెర్షన్‌లు వరుసగా రూ .59,999, రూ. 64,999 లకు అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు వేరియంట్ల అసలు ధరలు వరుసగా రూ .69,900 , రూ .74,900గా ఉంది. 256జీబీ వేరియంట్‌ ధర రూ .74,999 అందుబాటులో ఉంది. ప్లిప్‌కార్ట్‌ సుమారు 22 శాతం మేర డిస్కౌంట్లను అందిస్తోంది. 
చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఇదే..!


ఆపిల్‌ ఐఫోన్‌ 12 మోడల్‌ 64 జీబీ వేరియంట్‌పై సుమారు రూ. 12 వేల తగ్గింపుతో రూ. 66,999 అందించనుంది. 128జీబీ  వేరియంట్ రూ. 12901 తగ్గింపుతో రూ .71,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్-12 256జీబీ వేరియంట్ రూ. 81,999 కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.

చదవండి: Apple : సెప్టెంబర్‌ 14నే ఐఫోన్‌-13 రిలీజ్‌..! కారణం​ అదేనా..!
ఐఫోన్‌ 12 ప్రో 128జీబీ వేరియంట్‌ రూ. 1,15,900,  256జీబీ వేరియంట్ ధర రూ .1,25,900. 512జీబీ వేరియంట్ ధర రూ .1,45,900కు లభించనుంది. అంతేకాకుండా ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్‌ తగ్గింపును ప్రకటించింది. 128జీబీ, 256జీబీ, 512జీబీ వేరియంట్లు వరుసగా రూ. 1,25,900, రూ .1,35,900 , రూ .1,55,900 కు లభించనున్నాయి. 

చదవండి: Xiaomi: ఆయా దేశాల్లో స్మార్ట్‌ఫోన్లను బ్లాక్‌ చేసిన షావోమీ..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement