
Free Airpods: భారత్‌లో దసరా, దీపావళి పండుగ సీజన్స్ మొదలైనాయి. దీంతో పలు ఈ కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్ కూడా దీపావళి సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ఆపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్‌గా నడుస్తోంది. ఐఫోన్ 12 , ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఆపిల్ ఫస్ట్-జెన్ ఎయిర్‌పాడ్‌లను ఉచితంగా అందిస్తున్నట్లు ఆపిల్ గురువారం ప్రకటించింది.
చదవండి: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ బ్యూటీ..!
ఆపిల్ తన ఇండియా స్టోర్ పేజీలో దీపావళి సేల్ ఆఫర్ల వివరాలను ప్రకటించింది. ఐఫోన్ 13 సిరీస్ ప్రారంభించిన తర్వాత ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలను ఆపిల్ భారీగా తగ్గించింది. ఐఫోన్ 12 మినీ 64 జీబీ మోడల్ రూ. 59,900 కే లభిస్తుంది. 128 జీబీ మోడల్ ధర రూ. 64,900. 256జీబీ మోడల్ రూ .74,900కు ఆపిల్ తన వెబ్‌సైట్‌లో విక్రయిస్తోంది.
మరోవైపు,ఐఫోన్ 12 బేసిక్ మోడల్ 64జీబీ వేరియంట్ ధర రూ. 65,900, 128జీబీ వేరియంట్ ధర రూ. 70,900 వద్ద అందుబాటులో ఉంది. 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .80,900 వద్ద రిటైల్ అవుతోంది. సెప్టెంబర్ 14 న ఆపిల్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను వినియోగించిన విషయం తెలిసిందే.
చదవండి: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...!
Comments
Please login to add a commentAdd a comment