![Flipkart Get Apple iPhone 12 Mini under Rs 20000 only - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/27/mini-iphone2.jpg.webp?itok=VOoRgJSI)
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్‌ను సొంతంచేసుకునేందుకు ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఒక ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది. యాపిల్ లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 12 మిని పై భారీ తగ్గింపును ప్రకటించింది. తాజా డిస్కౌంట్‌లో ఐఫోన్ 12 మిని 64 జీబీ వేరియంట్‌ను రూ.20 వేల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ ఆఫర్ కలిపి ఈ తగ్గింపును అందిస్తోంది.
యాపిల్ ఐఫోన్ 12 మినీ: ఫ్లిప్‌కార్ట్ డీల్
ఐఫోన్ 12 మిని 64 జీబీ వేరియంట్ ఎంఆర్‌పీ ధర రూ. 59,900. దీన్ని ఫ్లిప్‌కార్ట్ రూ.49,999కి లిస్ట్ చేసింది. అంటే రూ.9901 తగ్గింపు. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేస్తే రూ. 30వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అంటే తాజా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా, 49,999 రూపాయలకి బదులుగా దాదాపు రూ. 20 వేలకే సొంతం చేసుకోవచ్చన్నమాట. దీంతోపాటు ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌పై 10 శాతం తక్షణ తగ్గింపును, అలాగే యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.
అయితే ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ స్మార్ట్‌ఫోన్ మోడల్, దాని కండిషన్, లాంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది అనేది గమనార్హం.
ఐఫోన్ 12 మిని 64 జీబీ స్పెసిఫికేషన్స్
5.4 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
ప్రాసెసర్: యాపిల్ ఏ14 బయోనిక్ చిప్‌సెట్
64జీబీ ర్యామ్, 128జీబీ మెమొరీ
12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 12ఎంపీ సెల్ఫీ కెమెరా.
స్టీరియో స్పీకర్లు, 5జీ కనెక్టివిటీ.
Comments
Please login to add a commentAdd a comment