
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ భారీ ఎత్తున డీల్స్, డిస్కౌంట్స్‌ను ప్రకటించింది. ఆగస్ట్ 24 నుంచి ఆగస్ట్ 28 వరకు ఫ్లిప్ కార్ట్ 'ఆపిల్ డేస్ సేల్'ను నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్, మాక్, ఆపిల్ వాచ్‌లతో పాటు ఐఫోన్ మినీ 12, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లను భారీ ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చని ఆపిల్ ప్రతినిధులు వెల్లడించారు.
ఐఫోన్ 12మినీ
రూ.69,900 ఉన్న ఐఫోన్ 12 మినీ పై రూ.8 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండగా.. రూ.61,990కే సొంతం చేసుకోవచ్చు. అడిషనల్ గా మరో రూ.2 వేల వరకు తగ్గుతుందని ఐఫోన్ నిర్వహాకులు చెబుతున్నారు. ఇక 64జీబీ వేరియంట్ ఫోన్లపై రూ.6 వేల వరకు ఇన్ స్టాంట్ డిస్కౌంట్ ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందవచ్చు.
చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్
ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్
ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ధర 129,900 ఉండగా రూ.9వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సైతం అదనంగా మరో రూ.4వేల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇక హెచ్ డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ తో ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ను కొనుగోలు చేస్తే రూ.5 వేల వరకు డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 11
ఐఫోన్ 11ధర రూ.54,900 ఉండగా ఆపిల్ డేస్ సేల్ రూ.51,999(రూ.2,910 తగ్గింపు) కే కొనుగోలు చేయవచ్చు. సిటీ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ.700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదే విధంగా రూ.47,900 ఉన్న ఐఫోన్ ఎక్స్ఆర్ ను రూ.41,999కే (రూ.5,901 తగ్గింపు) తో సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ ఎస్‌ఈ 2020 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.44,900 ఉండగా రూ.34,999 (రూ.9,901 తగ్గింపు)కే కొనుగోలు చేయవచ్చు.
మాక్, మాక్ బుక్ ఎయిర్ ఎం1
మాక్, ఫ్లిప్‌కార్ట్ లో మాక్ బుక్ ఎయిర్ ఎం1 ధర రూ.88,990 ఉండగా రూ. 10వేల డిస్కౌంట్ తో రూ.82,990 కే సొంతం చేసుకోవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ. 6వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.105,990 విలువైన 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ మోడల్ మాక్ బుక్ ప్రో పై రూ.7 వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.