ప్రపంచ మొబైల్ మార్కెట్లో ఐఫోన్ అమ్మకాల పరంగా రికార్డు సృష్టిస్తుంది. 2021 ఏడాదిలో మొదటి తొమ్మిది నెలల్లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఐదు స్మార్ట్ ఫోన్లలో నాలుగు ఐఫోన్లు, ఒక శామ్‌సంగ్ మొబైల్ నిలిచింది. ఐడీసీ విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రపంచ అమ్మకాల పరంగా చూస్తే ఐఫోన్ 12 మొదటి స్థానంలోను, శామ్‌సంగ్ ఏ12 రెండవ స్థానంలో, ఐఫోన్ 11 మూడవ స్థానంలో, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ నాల్గవ స్థానంలో, ఐఫోన్ 12 ప్రొ ఐదవ స్థానంలో నిలిచాయి. 2021 మొదటి మూడు నెలల్లో ఐఫోన్ 12 ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్‌గా నిలిచింది.
2021లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌గా శామ్ సంగ్ గెలాక్సీ ఏ12 మాత్రమే నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్‌లలో టాప్ 5లో 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఈస్మార్ట్ ఫోన్ 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీని ధర మన దేశంలో రూ.15,599గా ఉంది. గెలాక్సీ ఏ12 ఈ ర్యాంకింగ్ లో అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్. మిగిలిన యాపిల్ మోడల్స్ ధరలు భారీగా ఉన్నాయి.
4 out of the 5 most sold smartphones in the first three quarters of 2021 are from @Apple pic.twitter.com/B750knoyZC
— Francisco Jeronimo (He/Him) (@fjeronimo) November 22, 2021
(చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! క్లారిటీ ఇచ్చిన నితిన్ గడ్కరీ!)
Comments
Please login to add a commentAdd a comment