ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కు భారీ షాక్ తగిలింది. రానున్న రోజుల్లో ఐఫోన్‌లకు బదులుగా వాటి స్థానంలో అగుమెంటెడ్ రియాల్టీ హెడ్‌సెట్స్‌తో రీప్లేస్ చేసే పనిలో పడింది. కానీ యాపిల్ సంస్థకు అనుకోని విధంగా ఐఫోన్ వినియోగదారులతో పాటు పలు ఆటోమొబైల్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.
యాపిల్ ఇటీవల ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌లలో ఐఓఎస్ 15ను అప్ డేట్ చేసింది. ఆ ఐఓఎస్15 ను అప్‌డేట్ చేసుకున్న యూజర్ల ఫోన్‌లలో బ్లూటూత్ పనిచేయడం లేదని యాపిల్‌ను చివాట్లు పెడుతున్నారు. 9టూ 5 మాక్ కథనం ప్రకారం.. చాలా మంది ఐఓఎస్ 15.1 వినియోగదారులు కార్లలో బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్‌లతో కనెక్షన్ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఆ బగ్‌లను పరిష్కరించకుండా యాపిల్ వదిలేసిందని విమర్శిస్తున్నారు.
ఈ సమస్యలు ఎక్కువగా ఐఫోన్ 12, ఐఫోన్ 13 మోడళ్లతో కనిపిస్తుండగా.. ఆ సమస్య ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా టయోటా, ఆడి, వోల్వోతో పాటు అకురా,బీఎండబ్ల్యూ, చేవ్రొలెట్, ఫోర్డ్,హోండా,హూందాయ్,లింకన్, మాజ్డా, మెర్సిడిస్ బెంజ్, మిత్సుబిషి, ఫోర్ష్ కార్ల వినియోగదారులకు ఈ బ్లూటూత్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై వాహనదారులు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వరుస ఫిర్యాదులతో ఆటోమొబైల్ సంస్థల ప్రతినిధులు సైతం యాపిల్‌పై గుర్రుగా ఉన్నారు.
ఐఫోన్ 12, ఐఫోన్ 13 కోసమే
ఐఫోన్ 12, ఐఫోన్ 13 యూజర్ల సౌలభ్యం కోసం కాల్ డ్రాప్ పనితీరును మెరుగు పరిచేందుకు యాపిల్ సంస్థ ఐఓఎస్ 15.1.1 వెర్షన్‌ను విడుదల చేసింది. కానీ ఆ వెర్షన్ విడుదల యాపిల్ సంస్థకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. కోవిడ్ దెబ్బకు చిప్ షార్టేజ్ తలెత్తింది. అదే సమయంలో ఐఫోన్ 13ను పూర్తి స్థాయిలో యూజర్లకు అందించే విషయంలో వెనక్కి తగ్గడంతో యాపిల్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ఈ కొత్త సమస్య యాపిల్‌ను ఎంత అప్రతిష్టపాలు చేస్తుందోనని ఆ సంస్థ ప్రతినిధులు బయపడుతున్నారు. మరోవైపు యాపిల్ సంస్థ ఐఫోన్‌లను రీప్లేస్ చేస్తూ ఆగుమెంటెడ్ రియాల్టీ హెడ్ సెట్‌లపై పనిచేయడంపై యూజర్లు సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్ లను రీప్లేస్ చేయడం సరే, ఈ సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment