మనదేశంలో దసరా, దివాళీ ఫెస్టివల్ సేల్స్ కొనసాగుతున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్స్‌లో ఐఫోన్ 13 సిరీస్ ఫోన్‌లు భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఊహించని రీతిలో ఐఫోన్ 13 సేల్స్ జరగడంపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనిలో పనిగా భారత్‌లో ఐఫోన్13పై భారీ ఆఫర్లను ప్రకటించారు.
యాపిల్ సంస్థ సెప్టెంబర్ 14న ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా ఐఫోన్ 13 ను విడుదల చేసింది. దాని ధర రూ.79,900 ఉంది. తాజాగా ఈ ఫోన్‌పై రూ.14 వేల నుంచి రూ.24వేల వరకు ఆఫర్‌ను ప్రకటించారు. ఐఫోన్ 13ను డిస్కౌంట్, ఎక్ఛేంజ్, క్యాష్‌బ్యాక్ తో రూ.55.900కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 13పై డిస్కౌంట్
ఐఫోన్ 13పై రూ.24 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు రూ.6 వేల వరకు డిస్కౌంట్‌తో పాటు, 64జీబీ పాత ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫోన్ పై ఎక్ఛేంజ్ కింద రూ.15వేలు, అదనంగా మరో రూ.3వేలు బోనస్ అందిస్తున్నట్లు యాపిల్ సంస్థ తెలిపింది.
సంతోషంలో టిమ్ కుక్
ఇటీవల న్యూజూ గణాంకాల ప్రకారం.. 91.2 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో చైనా తొలిస్థానంలో ఉండగా భారత్ 43.9 కోట్ల మంది యూజర్లతో రెండో స్థానంలో ఉన్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో యాపిల్ సంస్థ బలంగా ఉన్న..భారత్‌లో యాపిల్‌కు చెందిన ఐఫోన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరిగేవికావు. సేల్స్ పెంచేందుకు టిమ్ కుక్ సైతం భారత్‌పై ఫోకస్ చేశారు. దేశంలో సొంత యాపిల్ స‍్టోర్లు, మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించే పనిలో ఉన్నారు.
అదే సమయంలో యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్' ను ఈ ఏడాది నిర్వహించింది. అయితే ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్‌లో టిమ్‌కుక్ ఐఫోన్ 13ను విడుదల చేశారు. విడుదల తరువాత యాపిల్ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇదే విషయాన్ని టిమ్ కుక్ బహిరంగంగా ప్రకటించారు. పనిలో పనిగా దీపావళి సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించారు.
చదవండి: అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్
Comments
Please login to add a commentAdd a comment