iPhone 13 Price Drop: Discount of RS 18000 Available - Sakshi
Sakshi News home page

ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..!

Published Fri, Dec 24 2021 8:21 PM | Last Updated on Sat, Dec 25 2021 8:31 AM

iPhone 13 Price Drop, Discount of RS 18000 Available - Sakshi

మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక గుడ్‌న్యూస్‌. విజయ్ సేల్స్ అనే కంపెనీ డిసెంబర్ 24 - 31 వరకు యాపిల్ డేస్ ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ఎవరైనా ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే వారికి రూ.18000 డిస్కౌంట్ లభించనున్నట్లు పేర్కొంది. కానీ, ఈ ఆఫర్ అందరికీ లభించదు. యాపిల్ కంపెనీ కొత్తగా లాంఛ్ చేసిన ఐఫోన్ 13 వాస్తవ ధర రూ.79,900. ఈ యాపిల్ డేస్ సేల్‌లో ఈ ఐఫోన్ 13 మీద రూ.4 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, ఎవరైనా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల సహయంతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే వారికి అదనంగా మరో రూ.6,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

కేవలం ఈ రెండు ఆఫర్లు మాత్రమే కాదు మరో ఆఫర్ కూడా ఉంది. ఎవరైనా తమ దగ్గర ఉన్నపాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.8,000 డిస్కౌంట్ పొందొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ రూ.5,000 + ఎక్స్‌ట్రా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ రూ.3,000 వస్తుంది. ఇలా రూ.5,000 విలువ గల స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు సహాయంతో ఐఫోన్ 13 కొనుగోలు చేస్తే మీకు రూ.18000(రూ.4000 + రూ.6000 + రూ.5000 + రూ.3000) వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతిమంగా ఈ ఐఫోన్ 13 రూ.61,900కు వస్తుంది. విజయ్ సేల్‌లో ఐఫోన్లతో పాటు 7 సిరీస్ వాచ్, ఎయిర్ పాడ్స్ 3వ జనరేషన్, ఎయిర్ పాడ్స్ ప్రో, మాక్ బుక్స్, ఐప్యాడ్, వాచీలు, హోమ్ పాడ్ మినీ, యాపిల్ కేర్ వంటి మీద కూడా భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఐప్యాడ్ కేటగిరీలో ఐప్యాడ్ 9వ జెన్ ₹26, 600కు ఐప్యాడ్ ఎయిర్ 4వ జెన్ ₹46, 900కు, ఐప్యాడ్ ప్రో 63,500 ₹వద్ద లభిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement