ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ 13పై భారీ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ అమెజాన్ ఈ-కామర్స్ పోర్టల్'లో మాత్రమే లభిస్తుంది. అది కూడా ఐఫోన్ 13 128జీబీ వేరియంట్ మీద మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ ఒప్పందాలతో ఐఫోన్ 13ను కేవలం రూ.53,550కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 అసలు ధర మొదట రూ.79,900 కాగా, అమెజాన్‌లో రూ.74,900కు లభిస్తుంది.
అంతే కాదు మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే మీకు రూ.15,350 వరకు ధర తగ్గనుంది. దీంతో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ 13 ధర రూ.59,550కు తగ్గుతుంది. ఇంకా, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ కొనుగోలు చేససటే మీకు రూ.6,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఐఫోన్ 13 128జీబి వేరియంట్ రూ.53,550కు లభించనుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఇప్పుడే మీరు కొనుగోలుచేయవచ్చు. అంతిమంగా మీకు ఈ మొబైల్ మీద రూ.26350(రూ.5000 + రూ.15,350 + రూ.6000 ) వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment