Iphone 13 Prices Reduced Ahead Of Iphone 14 Launch,Know Price Details - Sakshi
Sakshi News home page

iPhone 13 Prices Reduced: అదిరిపోయే డిస్కౌంట్‌లు, ఐఫోన్‌ 13పై బంపరాఫర్లు!

Published Tue, May 17 2022 6:48 PM | Last Updated on Tue, May 17 2022 9:06 PM

Iphone 13 Prices Reduced Ahead Of Iphone 14 Launch - Sakshi

స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఐఫోన్‌13పై బంపరాఫర్‌ ప్రకటించింది. అమెజాన్‌ అందిస్తున్న స్టన్నింగ్‌ డీల్‌లో కొనుగోలు దారులు భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో తక్కువ ధరకే ఐఫోన్‌ 13ను సొంతం చేసుకోవచ్చు.


ఈ ఏడాది జూన్‌(అంచనా మాత్రమే)లో టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫిరెన్స్‌(డబ్ల్యూ డబ్ల్యూ డీసీ) నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో యాపిల్‌ ఐఫోన్‌14ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ ఐఫోన్‌ 13లపై డిస్కౌంట్‌లు ప్రకటించింది. రూ.28,550 డిస్కౌంట్‌తో 128జీబీ ర్యామ్‌తో ఐఫోన్‌ 13ను కేవలం రూ.51,350కే అందిస్తుంది.  

అమెజాన్‌లో ఐఫోన్‌ 13ధర తగ్గింపు 
ఒరిజనల్‌గా 128జీబీ యాపిల్‌ ఐఫోన్‌ 13ఫోన్‌ ధర రూ.79,900 ఉండగా ఈ ఫోన్‌ అమెజాన్‌ రూ.51,350కే అందిస్తుంది. ముందుగా ఈ ఫోన్‌ కొనుగోలు దారులు రూ.10వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో ఆ ఫోన్‌ ధర రూ.69,990కి తగ్గుతుంది. దీంతో ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.18,550 తగ్గగా.. ఆఫోన్‌ అసలు ధర కంటే రూ.28,550 తగ్గి రూ.51,350కే వస్తుంది.       

ఐఫోన్‌ 13 ఫీచర్లు
యాపిల్‌ ఐఫోన్‌ 60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.1 అంగుళాల రెటీనా డిస్‌ప్లే,ఏ15 బయోనిక్‌ చిప్‌ సెట్‌, యాపిల్‌కు చెందిన గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌(జీపీయూ), డ్యూయల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ విత్‌ 12ఎంపీ ప్రైమరీ లెన్స్‌, ఫ్రంట్‌ సైడ్‌ 12 ఎంపీ ఆల్ట్రా వైడ్‌ లెన్స్‌, రెటీనా ఫ్లాష్‌తో 12ఎంపీ సెల్ఫీ కెమెరా,128జీబీ స్టోరేజ్‌ ఫీచర్లు ఉన్నాయి.

చదవండి👉 భారత్‌లో ఐఫోన్‌ అమ్మకాలు అదరగొట్టేస‍్తున్నాయ్‌, రూ.10వేల కోట్లకు యాపిల్‌ ఎగుమతులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement