అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును, ఎక్సేఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. ఈ-కామర్స్ సంస్థలకు ధీటుగా ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్‌చైన్ సంస్థ క్రోమా ఐఫోన్ 13పై భారీ తగ్గింపును అందిస్తోంది.
అతి తక్కువ ధరకే ఐఫోన్ -13ను అందించేందుకుగాను క్రోమా పలు బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఐసీఐసీఐ, కోటక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల క్రెడిట్ కార్డుతో కొనుగోలుచేస్తే రూ. 6000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా మీరు పాత ఫోన్ ఎక్సేఛేంజ్ చేస్తే కూడా దానిపై కొంత తగ్గింపును క్రోమా ఇస్తుంది. ఐఫోన్ 12, ఐఫోన్ 11పై భారీ ఎక్సేఛేంజ్ ఆఫర్ లభిస్తోంది.
క్రోమా ఐఫోన్ 13ని రూ.73,990 ప్రారంభ ధరకు విక్రయిస్తోంది. ఆయా బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే iPhone 13 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 67,990కి పొందగలరు. అదనంగా, పాత ఐఫోన్‌ను ఎక్సేఛేంజ్ చేస్తే...ఐఫోన్ 13 ధర మరింత తగ్గనుంది. iPhone 12 128GB స్టోరేజ్ మోడల్‌పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కింద దాదాపు రూ. 24,500 అందిస్తోంది. దీంతో iPhone 13 ధరను దాదాపు రూ. 43,500కు తగ్గనుంది.
చదవండి: ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వంతు..భారీగా పెరిగిన ధరలు...! కొత్త ధరలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment