ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లు లీకయ్యాయి. లీకైన ఫీచర్ల యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటుండగా ఐఫోన్ 14సిరీస్ ఫోన్‌లలో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ షూటర్, న్యూ చిప్ సెట్ తో పాటు 3ఎన్‌ఎమ్ లేదంటే 4ఎన్‌ఎమ్ ప్రాసెసర్‌లు ఉండనున్నాయి. కొత్తగా వస్తున్న ఐఫోన్ 14సిరీస్ నుంచి ఇకపై అన్నీ ఫోన్లకు పోర్ట్ లెస్ డిజైన్‌తో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ 13 సిరీస్‌తో యూజర్లను ఆకట్టుకున్న యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ విడుదలతో అన్నీదేశాల స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఐఫోన్ 14 ఫీచర్లు
►వచ్చే ఏడాది స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫీచర‍్లు యూజర్లను కట్టిపడేస్తున్నాయి.యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌లో ఐఫోన్ మిని, ఐఫోన్ 13, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 14సిరీస్‌లో మాత్రం 6.1 అంగుళాలతో ఐఫోన్ 14ప్లస్, 6.7అంగుళాలతో ఐఫోన్ 14మ్యాక్స్ మోడల్స్‌తో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
►ఇక డిజైన్ విషయంలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14సిరీస్ లో భారీ మార్పులు చేయనుంది. ఇప్పటికే డిజైన్ల మార్పులపై యాపిల్ ప్రతినిధులు పనిచేస్తున్నారని ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఎనలిస్ట్ మార్క్ గుర్మాన్ తెలిపారు.
►మారనున్న డిజైన్లపై ఐఫోన్‌లను భారీ ఎత్తున అమ్మకాలు జరిపే 'జాన్ ప్రాసెసర్ మాట్లాడుతూ..ఐఫోన్‌లలో నాచ్ డిజైన్‌ను తొలగించి..ఐఫోన్ 14సిరీస్ నుంచి పంచ్ హోల్ కెమెరా ఉండగా, ప్రోమోడల్స్‌లో లిమిటెడ్‌గా ఓఎల్‌ఈడీ ప్యానల్ కింద ఫేస్ ఐడి సెన్సార్లను డిజైన్ చేయనున్నట్లు' తెలిపారు.
► ఐఫోన్ 14లో..ఐఫోన్ 4 డిజైన్‌లు ఉండనున్నాయి. ముఖ్యంగా ఫోన్ ఫ్లాట్ సైడ్ భాగంలో ఉండే వ్యాల్యూమ్, మ్యూట్ బటన్‌లు రౌండ్‌గా ఉండనున్నాయి. ఫోన్ వెనక భాగంలో ఫినిషింగ్ గ్లాస్ ఉండగా..సైడ్‌లు టైటానియంతో తయారు చేసే అవకాశం ఉందని జాన్ ప్రాసెసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్యానెల్ కెమెరా బంప్ లేకుండా పూర్తిగా ఫ్లాట్‌గా ఉండనుంది.
►లీకైన రిపోర్ట్‌ల ప్రకారం.. ఐఫోన్ 14లో టచ్ ఐడి ఉండనుంది. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీలో టచ్ ఐడి పవర్ బటన్‌లో డిజైన్‌తో ఉంది.
►ఐఫోన్ 14 సిరీస్ మోడళ్లకు 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 60హెచ్‌జెడ్ ఎల్‌టీపీఎస్ ప్యానెల్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఆటో ఫోకస్ ఫీచర్, వెనుక కెమెరా 12మెగాపిక్సెల్ సెన్సార్ నుండి అప్‌గ్రేడింగ్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను పొందుతుంది.
►విడుదలయ్యే ఐఫోన్‌లలో స్టాండడ్ చిప్‌సెట్‌లు ఉండనున్నాయి. ఐఫోన్ 13లో 3 ఎన్‌ఎం చిప్ సెట్‌లు ఉండగా..ఐఫోన్ 14 చిప్‌సెట్‌లు 4 ఎన్‌ఎంలు ఉండనున్నాయి.
►ఐఫోన్‌లు పూర్తిగా పోర్ట్‌లెస్ డిజైన్‌కు మారుతాయని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. కానీ ఐఫోన్ 13లో సైతం ఈ పోర్ట్ లెస్ డిజైన్‌తో విడుదల చేయలేదు. అయితే ఐఫోన్14 వైర్‌లెస్‌గా మారే అవకాశం ఉంది.
ఐఫోన్ 14 విడుదల, ధర
యాపిల్ ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహించే ఈవెంట్‌లో ఐఫోన్‌లను విడుదల చేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 14 యాపిల్ ఐఫోన్ 13 ని విడుదల చేసింది. వచ్చే ఏడాది యాపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ 14సిరీస్ ఫోన్‌లు విడుదల కానున్నాయి.ఇక ఐఫోన్ 14సిరీస్ 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 13 బేస్ వేరియంట్ రూ.79,990గా ఉండగా ఐఫోన్ 14 ధర కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉందని లీకైన రిపోర్ట్‌ల ఆధారంగా తెలుస్తోంది.
చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్
Comments
Please login to add a commentAdd a comment