ఈ ఏడాది చివరలో ఐఫోన్‌ 13..! | IPhone 13 Likely To Release In Late 2021 | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివరలో ఐఫోన్‌ 13..!

Published Thu, Jun 24 2021 10:27 PM | Last Updated on Thu, Jun 24 2021 10:28 PM

IPhone 13 Likely To Release In Late 2021 - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆపిల్​ కంపెనీ ఉత్పత్తులకు  ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్‌ ఐఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్‌. ఆపిల్‌ నుంచి ‘ఐఫోన్​ 13’ సిరీస్​ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది.  ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్​ 13 సిరీస్​ స్మార్ట్​ఫోన్లు మార్కెట్​లోకి వస్తాయని తెలుస్తోంది. కాగా ఈ ఫోన్‌ ఐఫోన్​ 12కు తదనంతర ఫోన్‌గా రానుంది. అమెరికా ప్రముఖ చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఐఫోన్​ 13 అమ్మకాలు గణనీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్​ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రముఖ మార్కెట్​ అనలిస్ట్​ మింగ్​ చి కుయో మాట్లాడుతూ..2022 మొదటి అర్థభాగంలోనే ఆపిల్ కొత్త 5జీ ఐఫోన్ ఎస్‌ఈ విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు విడుదలైన ఐఫోన్​ మోడల్స్​లో ఈ​ మోడల్ అత్యంత చౌక ధర వద్దే లభించే అవకాశం ఉంది. ఐఫోన్‌ 13 ఫోన్‌ పోర్ట్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌​ వంటి సరికొత్త ఫీచర్లతో రానుంది. 

చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement