Apple Announces Back To University Offer For Students And Teachers, Free Airpods & Exclusive Discounts - Sakshi
Sakshi News home page

Apple Offers: మీరు స్టూడెంట్సా? యాపిల్‌ బంపరాఫర్‌.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్‌ పాడ్స్‌!

Published Fri, Jun 23 2023 5:08 PM | Last Updated on Fri, Jun 23 2023 6:17 PM

Apple Announces Back To University Offer - Sakshi

భారతీయ విద్యార్ధులకు ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘బ్యాక్‌ టూ యూనివర్సిటీ 2023’ పేరుతో జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు జరిగే ఈ సేల్‌లో విద్యార్ధులు కొనుగోలు చేసే ఐపాడ్‌, మ్యాక్‌బుక్స్‌,డెస్క్‌ ట్యాప్‌ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. 

11 అంగుళాల యాపిల్‌ ఐపాడ్‌ ప్రో, 12.9 అంగుళాల ఐపాడ్‌ ప్రో, 24 అంగుళాల ఐపాడ్‌ పో’లు డిస్కౌంట్‌ ధరకే సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఇక, ఈ సేల్‌లో కొనుగోలు చేసే ప్రొడక్ట్‌లపై ఉచితంగా ఎయిర్‌ పాడ్స్‌, యాపిల్‌ కేర్‌ ప్లస్‌ ప్లాన్స్‌ పై 20 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. బ్యాక్‌ టూ యూనివర్సిటీ సేల్‌లో విద్యార్ధులతో పాటు బోధన,బోధనేతర సిబ్బంది యాపిల్‌ ప్రొడక్ట్‌లను మార్కెట్‌ ధర కంటే తక్కువకే పొందవచ్చు.    

ప్రస్తుతం, కొనసాగుతున్న సేల్‌లో అర్హులైన కస్టమర్లు 11 అంగుళాల ఐపాడ్‌ ప్రో ధర రూ.96,900 ఉంటే రూ.76,900కే కొనుగోలు చేయొచ్చు. 12.9 అంగుళాల ఐపాడ్‌ ప్రో ధర రూ.1,12,900 ఉంటే రూ.1,02,900కే, రూ.59,900 ఐపాడ్‌ను రూ.54,900కే పొందవచ్చు. ఈ మూడు ఐపాడ్‌ మోడళ్లపై సెకండ్‌ జనరేషన్‌ యాపిల్‌ పెన్సిల్‌లు ఉచితంగా అందిస్తుంది. 

ఎం 1 పవర్డ్‌ 13 అంగుళాల మాక్‌ బుక్‌ ఎయిర్‌ను రూ. 89,900కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు లాంచ్ ధర రూ.99,900గా ఉంది. 13 అంగుళాల మ్యాక్‌ బుక్‌ ఎయిర్‌ 13 అసలు ధర రూ.1,29,900 కాగా రూ.1,04,900 కే విద్యార్ధులు కొనుగోలు చేయొచ్చు. సేల్‌లో 15 అంగుళాల మ్యాక్‌ బుక్‌ ఎయిర్‌ ధర రూ. 1,24,900, అసలు ధర రూ. 1,34,900 గా ఉంది.

తాజా,ఆఫర్‌లు ధృవీకరించబడిన విద్యార్ధులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ విద్యార్థులు,ఇతర సిబ్బంది యాపిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్‌ చేసి అర్హులో, కాదో తెలుసుకోవచ్చు.

చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement