హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ తయారీ సేవల (ఈఎంఎస్) సంస్థ సైయంట్ డీఎల్‌ఎం పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) వస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాస్పెక్టస్ ముసాయిదాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ నిధులను మూలధనం, రుణాల చెల్లింపు, ఇతర సంస్థల కొనుగోలు తదితర అవసరాల కోసం వినియోగించుకోనుంది.
ఈ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో షేర్ల విక్రయం ఉండదు. పూర్తిగా కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్ రౌండులో రూ. 148 కోట్ల వరకు విలువ చేసే షేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్‌కు ఇది అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హైదరాబాద్, బెంగళూరు, మైసూర్‌లో తయారీ ప్లాంట్లు ఉన్నాయి.
చదవండి: అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంతమంది అంటే?
Comments
Please login to add a commentAdd a comment