హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.14 తుది డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాదితో పోలిస్తే మార్చి త్రైమాసికంలో 49% అధికమై రూ.154 కోట్లు నమోదు చేసింది. నికరలాభం మూడేళ్లలో ఇదే గరిష్టం అని కంపెనీ వెల్లడించింది.
ఎబిటా రూ.171 కోట్లు, ఎబిటా మార్జిన్ 14.5 శాతంగా ఉంది. టర్నోవర్ 8 శాతం అధికమై రూ.1,181 కోట్లు సాధించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి నికరలాభం 43 శాతం దూసుకెళ్లి రూ.522 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 9.7 శాతం పెరిగి రూ.4,534 కోట్లు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment