నాలుగు విభాగాల్లో లీడర్‌గా సైయంట్‌ | Zinnov rates Cyient as a Leader across Four Industry Verticals | Sakshi
Sakshi News home page

నాలుగు విభాగాల్లో లీడర్‌గా సైయంట్‌

Published Tue, Dec 27 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

నాలుగు విభాగాల్లో లీడర్‌గా సైయంట్‌

నాలుగు విభాగాల్లో లీడర్‌గా సైయంట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయంట్‌.. నాలుగు వ్యాపార విభాగాల్లో ఆధిపత్య రేటింగ్‌ దక్కించుకుంది. అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సంస్థ జిన్నోవ్‌ రూపొందించిన జిన్నోవ్‌ జోన్స్‌ 2016 ప్రోడక్ట్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ నివేదికలో సైయంట్‌కు ఈ ర్యాంకింగ్‌ దక్కింది.

ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, ఎనర్జీ అండ్‌ యుటిలిటీస్, రవాణా, కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మెషినరీ విభాగాల్లో సైయంట్‌ను లీడర్‌గా జిన్నోవ్‌ రేటింగ్‌ ఇచ్చింది. అలాగే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సేవల్లో కీలకమైన సంస్థగా పేర్కొంది. క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేయడం, పదునైన కొనుగోళ్ల వ్యూహాలు మొదలైనవి ఈ ర్యాంకింగ్‌లకు దోహదపడ్డాయని సైయంట్‌ సీఈవో కృష్ణ బోదనపు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement