![సైయంట్ ప్రత్యేక డివిడెండ్](/styles/webp/s3/article_images/2017/09/4/81472501764_625x300.jpg.webp?itok=D0ulP_G9)
సైయంట్ ప్రత్యేక డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ .. సిల్వర్ జూబిలీ వేడుకల సందర్భంగా ప్రత్యేక డివిడెండు ప్రకటించింది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 2.50 (50 శాతం) అందించనున్నట్లు వివరించింది. ప్రత్యేక డివిడెండు రూపంలో మొత్తం రూ. 34 కోట్లు చెల్లించనున్నట్లు సైయంట్ పేర్కొంది. ప్రత్యేక డివిడెండుకు రికార్డు తేది సెప్టెంబర్ 9 కాగా, చెల్లింపు తేది సెప్టెంబర్ 16. మరోవైపు, ఉద్యోగులకు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (ఆర్‌ఎస్‌యూ) పథకం కింద షేర్లను కేటాయించనున్నట్లు, ఆర్థికంగా దీని ప్రభావం రూ. 34 కోట్ల మేర ఉండనున్నట్లు సంస్థ తెలిపింది.