కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ పై జుబ్లీహిల్స్ పోలీసులు రాష్ డ్రైవింగ్ చేసినందుకు కేసును నమోదు చేశారు. నిన్నరాత్రి సేఫ్ డ్రైవింగ్ లోభాగంగా ప్రత్యేక విధులు నిర్మహిస్తున్న పోలీసులు వేగంగా దూసుకొస్తున్న కారును గమనించారు.
సుజనచౌదరి కుమారునిపై కేసు
Published Sat, Apr 16 2016 3:26 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ పై జుబ్లీహిల్స్ పోలీసులు రాష్ డ్రైవింగ్ చేసినందుకు కేసును నమోదు చేశారు. నిన్నరాత్రి సేఫ్ డ్రైవింగ్ లోభాగంగా ప్రత్యేక విధులు నిర్మహిస్తున్న పోలీసులు వేగంగా దూసుకొస్తున్న కారును గమనించారు.
ఈ కారును జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి కేబీఆర్ పార్కువైపు రాష్ డ్రైవింగ్ చేస్తూ కార్తీక్ పట్టుపడ్డాడు. దీంతో అతనిపై కేసును నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎన్. విద్యాసాగర్ తెలిపారు. కార్తీక్ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేశారు. కార్తీక్ ను అరెస్టు చేయలేదని, అతనికి జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తన్న మరి కొంత మందిపై సైతం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement