నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. శ్రీధర్ అనే వ్యక్తి భార్యా, ఇద్దరు పిల్లలతో కలసి బైక్‌పై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కార్తీక్ (4) అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.