
ఎల్కతుర్తి: ప్రాణస్నేహితులిద్దరూ చనిపోయారన్న బెంగతో ఒక డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో సోమ వారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తంగళ్లపెల్లి సంపత్, సుమలత దంపతులకు ఇద్దరు కుమారులున్నారు.
కార్తీక్(21) హనుమకొండలో డిగ్రీ ప్రథమ సంవత్సరం, చిన్న కుమారుడు వినయ్ 8వ తరగతి చదువుతున్నారు. కార్తీక్ మేనమామ కుమారుడు అఖిల్ ఆరేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయాడు. మరో స్నేహితుడు రాకేష్ రెండేళ్ల క్రితం మృతి చెందాడు.
ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు కావడంతో.. వారు చనిపోయినప్పటి నుంచి కార్తీక్ దిగాలుగా ఉండేవాడు. తాను కూడా వారి వద్దకు వెళ్తానంటూ.. అప్పుడప్పుడు తల్లిదండ్రులకు చెప్పేవాడు. దీంతో వారు అధైర్యపడొద్దని కుమారుడికి సర్దిచెప్పేవారు. కాగా, కార్తీక్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు. ఎస్‌ఐ పరమేశ్ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment