విజయ హజరే ట్రోఫి తమిళనాడు కైవసం
న్యూఢిల్లీ: విజయ హజరే క్రికెట్ ట్రోఫి ఫైనల్ తమిళనాడు- బెంగాల్ జట్ల మధ్య మార్చి 20 ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు విజయం సాధించి ట్రోఫిని కైవసం చేసుకుంది. 37 పరుగుల తేడాతో ప్రత్యర్ధి బెంగాల్ జట్టును మట్టికరిపించి విజయం సాధించింది. 50 ఓవర్ల మ్యాచ్ ఫార్మాట్‌లో తమిళనాడు ప్రత్యర్ధి బెంగాల్‌ను ఓడించడం ఇది మూడోసారి. తమిళనాడు విజయ హజరే ట్రోఫిని 2002- 03లో గెలుచుకుంది. అంతేకాక 2004-05లో కూడా ఉత్తరప్రదేశ్‌తో కలిసి సమానంగా ట్రోఫిని కైవసం చేసుకున్నాయి. మొదట బ్యాటింగ్ చేసినా తమిళనాడు 47.2 ఓవర్ల లో 217పరుగులకే ఆలౌట్ అయింది. తమిళనాడు బ్యాట్స్‌మెన్స్ ఎవరు అంతగా రాణించలేకపోయారు.
ఒక కార్తీక్ మాత్రమే 112 పరుగులు చేశాడు. బెంగాల్ బౌలర్లు మహ్మమద్ సమీ 4 వికెట్లు, అశోక్ దిండా 3 వికెట్లు తీశారు. తమిళనాడు బౌలర్ల దాటికి బెంగాల్ 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. తమిళనాడు బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంపై ఆశలు పెంచారు. అమీర్ గనీ(0/42/10), ప్రజ్ఞాన్ ఓజా(0/49//10) ఇద్దరు కలిసి 20 ఓవర్లకు 91 పరుగులు ఇచ్చారు. విజయ్ హజారే ట్రోఫిని తమిళనాడు కైవసం చేసుకోవడం ఇది రెండోసారి. ఈ విజయంలోబౌలర్ల పాత్ర మరవలేనిది.