సెప్టెంబర్ 13న పుట్టిన రోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On September 13, the birthday celebration is buying Celebrities | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 13న పుట్టిన రోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Sat, Sep 12 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

సెప్టెంబర్  13న పుట్టిన రోజు జరుపుకొంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 13న పుట్టిన రోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: కార్తీక్ (నటుడు), మహిమా చౌదరి (నటి)
 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యం ఏర్పడటం వల్ల ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. పుట్టిన తేదీ 13. ఇది రాహు సంఖ్య. ఇది సూర్య, గురుల కలయి కతో ఏర్పడటం వల్ల రాజయోగాన్నిస్తుంది. అయితే ఈ యోగం జీవితం ప్రథమార్ధంలో కొంత కష్టాలను ఇచ్చి 35 సంవత్సరాల తరవాత నుంచి మంచి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, స్థిరాస్తులు ఇస్తుంది. కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి బాగా కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. లక్కీ నంబర్స్: 3,4,5, 6; లక్కీ కలర్స్: వయోలెట్, క్రీమ్, గోల్డెన్, రెడ్, శాండల్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, సోమవారాలు.

 సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం, గురువులను, మతపెద్దలను, పండితులను గౌరవించడం, దుర్గాదేవిని ఆరాధించడం, దక్షిణామూర్తిని అభిషేకించడం, పేదవితంతువులకు సాయం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement