బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా పాపులర్ అయిన కమెడియన్ కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు అయ్యాడు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్లు హాజరయ్యారు. వారందరూ కొత్త దపంతులను ఆశీర్వదించారు.
(ఇదీ చదవండి: టక్కర్ సినిమా ట్విటర్ రివ్యూ, టాక్ ఎలా ఉందంటే?)
ఈ మేరకు కొత్త దంపతులతో దిగిన ఫోటోలను గెటప్ శ్రీను షోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు. అయితే, గతంలో తన భార్యను సిరి అని సంబోధించాడు కార్తీక్. కానీ, గెటప్ శ్రీను మాత్రం పెళ్లికుమార్తె పేరు శ్రీలేఖ అని పేర్కొన్నాడు. బహుశా సిరి అనేది ముద్దుపేరేమో. వరంగల్‌లో పుట్టిన కార్తీక్ ఇంజినీరింగ్ పూర్తి చేసి సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చాడు. ఇప్పటికే టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. గతేడాది విడుదలైన ‘ముఖచిత్రం’, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు.
(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!)
Comments
Please login to add a commentAdd a comment