Comedian Kevvu Karthik Announces Wedding Plans, Shares Pics On Instagram - Sakshi
Sakshi News home page

Kevvu karthik: ‍కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్

Published Sun, Jun 4 2023 12:07 PM | Last Updated on Sun, Jun 4 2023 1:04 PM

Jabardasth Comedian Kevvu Karthik Shares His  - Sakshi

జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ శుభవార్తను అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. తనతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ నోట్ రాసుకొచ్చాడు. తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు. అయితే ఇందులో ఆ అమ్మాయి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. 

అయితే తాజాగా మరోసారి తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేస్తూ మరోసారి ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోల్లో తనకు కాబోయే ‍అమ్మాయి ముఖ పరిచయం చేశారు. అంతే కాకుండా ఫోటోలతో పాటు ఓ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు కెవ్వు కార్తీక్. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

(ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!)

కార్తీక్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఫైనల్‌గా నేను చేసుకోబోయే ‍అమ్మాయి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నా. కానీ ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. రెండు భిన్నమైన మనసులు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు జీవిత ప్రయాణమనే పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి.. వెల్‌కమ్‌ టూ మై లైఫ్ సిరి.' అంటూ పోస్ట్ చేశారు.  

కాగా కెవ్వు కార్తీక్‌ ఎన్నో కష్టాలు దాటుకుని సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు. ఓ పక్క ఇంజనీరింగ్‌ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేసిన అతడు ఎంటెక్‌ చేసి ఉద్యోగం సంపాదించాడు. కానీ మిమిక్రీ, కామెడీపై ఉన్న ప్యాషన్‌తో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తర్వాత హైదరాబాద్‌ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. అనంతరం కామెడీ క్లబ్‌, జబర్దస్త్‌ షోలలో మెరిశాడు. జబర్దస్త్‌లో ఒక టీమ్‌లో సభ్యుడిగా మాత్రమే ఉన్న కార్తీక్‌ తర్వాత టీమ్‌ లీడర్‌గా మారాడు.

(ఇది చదవండి: మరోసారి జంటగా లవ్‌ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement