చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ శ్రీకాకుళంలో ప్లాన్ చేసింది. శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి గత 2,3 రోజుల నుంచి రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తీక్ తీడా ఎంతో రీసెర్చ్ ఈ రియల్ స్టోరీ రాశారట.
ఫిషర్ మాన్స్ తో 2, 3 నెలలు స్వయంగా ఉండీ, వాళ్లతోనే తింటూ, వాళ్లలో ఒకడిగా ఉంటూ, వారితో ప్రయాణం చేస్తూ వారి జీవన శైలీని పూర్తిగా తెలుసుకొని స్టోరీ రాసినట్లు ఓ సందర్భంలో రచయిత కార్తీక్ తీడా చెప్పారు. సముద్రంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ తో వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు అన్ని పరిశీలించారట. అలా రాజు, బుజ్జిల కథను అత్యద్భుతంగా, సినిమాటిక్ విజన్ తో తీర్చిదిద్దారు. తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో స్టోరీని వినిపించగా కథ నచ్చడంతో ఇప్పుడు రూపం దాల్చుకుంది.
రచయిత కార్తీక్ తీడా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఈ తరుణంలోనే శ్రీకాకుళంలో జరిగిన యదార్ధ సంఘటనను సినిమాగా రాయాలి అనే సంకల్పంతో తండెల్ కథ మొదలుపెట్టి అత్యద్భుతంగా రాసుకొచ్చారు. ఈ చిత్రంలో రాజుగా నాగచైతన్య నటిస్తుండగా.. ఆయనకు జోడిగా బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment