
సూరజ్, అఖిల్ కార్తీక్ హీరోలుగా, సోనియా, ఫర హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘టు ఫ్రెండ్స్’. ‘ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మించిన ‘టు ఫ్రెండ్స్’ ట్రైలర్ విడుదల చేసే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది.
ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్.. వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన నేను సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. భవిష్యత్తులోనూ మరిన్ని మంచి సినిమాలు తీస్తా’’ అన్నారు ముళ్లగూరు అనంతరాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్లే ఈ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ జి.ఎల్.బి.
Comments
Please login to add a commentAdd a comment