రాచర్లగొల్లపల్లిలో తల్లీ కుమారుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

రాచర్లగొల్లపల్లిలో తల్లీ కుమారుడి అదృశ్యం

Published Sat, Jul 29 2023 1:24 AM | Last Updated on Sat, Jul 29 2023 8:33 AM

- - Sakshi

కరీంనగర్: మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన తల్లీకుమారుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై రమాకాంత్‌ వివరాల ప్రకారం.. రాచర్లగొల్లపల్లికి చెందిన కాటికాపల పోచమ్మ అనే యువతి గతేడాది భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి తన ఐదేళ్ల కుమారుడు కార్తీక్‌తో కలిసి తల్లిగారింట్లో ఉంటోంది.

ఈ క్రమంలో ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు బస్టాండ్‌లో పని ఉందని చెప్పి, కుమారుడిని తీసుకొని వెళ్లి, కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు రెండు రోజులు గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోచమ్మ తల్లి దుర్గవ్వ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, తల్లీకుమారుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement