ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్ వేయడం.. డ్యాన్స్ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్‌గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్.
తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్ తాజాగా హోం టూర్ వీడియో చేశాడు. తన ఇంటి గేటు దగ్గరి నుంచి ప్రతీది ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలిపాడు.
'గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు హోంటూర్ చేశాను. నేను సొంతంగా ఓ ఇల్లు కొనుకున్నాక మళ్లీ హోంటూర్ వీడియో చేయాలనుకున్నాను. ఏడాది క్రితమే ఈ ఇల్లు కొన్నప్పటికీ ఇంటీరియర్, వస్తువులు అన్నీ సమకూర్చుకునేసరికి ఇంత సమయం పట్టింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తిగా రెడీ అవడంతో వీడియో చేశాను. గతంలో నేను కింద పడుకునేవాడిని. సోఫా కూడా ఉండేది కాదు. నాకంటూ సొంతిల్లు ఉన్నాకే అవన్నీ కొనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవి కొనుక్కున్నాను' అంటూ ప్రతి గదిని క్షుణ్ణంగా చూపించాడు కార్తీక్.
హాల్, పూజ గది, డైనింగ్ టేబుల్, కిచెన్, మూడు బెడ్‌రూమ్స్, బాల్కనీ అన్నింటినీ తనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేయించుకున్నాడు. తన అవార్డులు, గృహప్రవేశానికి వచ్చిన బహుమతులను సైతం చూపిస్తూ పోయాడు. తన బాల్కనీని మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంట్లో నెమళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తుండటం విశేషం. కాంక్రీట్ జంగిల్‌లో కాకుండా కాస్త ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశంలో కార్తీక్ తన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సైతం ఇల్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎమ్మెల్యేగా పోటీ? స్పందించిన రాహుల్
Comments
Please login to add a commentAdd a comment