‘మాల్‌’ మేనేజర్‌ లైంగిక వేధింపులు | sexual abuse Incident in Bangalore Shopping Mall | Sakshi

‘మాల్‌’ మేనేజర్‌ లైంగిక వేధింపులు

Apr 12 2017 4:43 AM | Updated on Sep 2 2018 4:03 PM

‘మాల్‌’ మేనేజర్‌ లైంగిక వేధింపులు - Sakshi

‘మాల్‌’ మేనేజర్‌ లైంగిక వేధింపులు

బెంగళూరులో మరో లైంగిక వేధింపుల ఘటన ఆసల్యంగా మంగళవారం వెలుగుచూసింది. నగరంలోని బాణసవాడి రింగ్‌రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ షాపింగ్‌మాల్‌ మేనేజర్‌ కార్తీక్‌

= బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

కృష్ణరాజపుర: బెంగళూరులో మరో లైంగిక వేధింపుల ఘటన ఆసల్యంగా మంగళవారం వెలుగుచూసింది. నగరంలోని బాణసవాడి రింగ్‌రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ షాపింగ్‌మాల్‌ మేనేజర్‌ కార్తీక్‌ గత కొద్ది కాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ షాపింగ్‌మాల్‌లో బ్యూటీ అడ్వైజర్‌గా పని చేస్తున్న యువతి ఆరోపించారు. మాల్‌లో వస్తువులను ఇచ్చే క్రమంలో తనను అసభ్యకర రీతిలో తాకుతూ తరచూ లైంగిక వేధిపులకు పాల్పడుతున్నాడని అనేకసార్లు హెచ్చరించినా ఫలితం లేదని తెలిపారు.

ఇటీవల మరోసారి అదేవిధంగా లైంగిక వేధింపులకు పాల్పడగా ప్రతిఘటించడంతో తనకు సహకరించకుంటే దొంగతనం చేసావంటూ పోలీసు కేసు బనాయిస్తానంటూ   బెదిరించినట్లు తెలిపారు. దీంతో యువతి రామ్మూర్తినగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేనేజర్‌ కార్తీక్‌పై చర్యలు తీసుకోకుండా వదిలేసారంటూ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయాన్ని మీడియాకు తెలియజేస్తే మరెక్కడా ఉద్యోగం దొరక్కుండా చేస్తామంటూ బెదిరించినట్లు ఆమె తెలిపారు.

 కార్తీక్‌కు షాపింగ్‌మాల్‌ అసిస్టెంట్‌ స్టోర్‌ మేనేజర్‌ కిరణ్, హెచ్‌ఆర్‌ సంతోష్, మరి కొంత మంది సీనియర్లు కూడా సహకరించారని ఆమె ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసుకోవడానికి మొదట పోలీసులు కూడా వెనుకడుగేసారని కానీ మీడియాకు తెలిస్తే సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో నామమాత్రంగా కార్తీక్, సంతోష్‌ తదితరులపై కేసులు నమోదు చేసారంటూ ఆమె ఆరోపించారు. తనతో పాటు షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్న మరో ఐదుగురు యువతులను కూడా ఇదే విధంగా లైంగిక వేధిస్తున్న కార్తీక్‌తో పాటు అతడికి సహకరిస్తున్న సంతోష్, షాపింగ్‌మాల్‌ సీనియర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్‌ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement