వివాహం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌కు.. తల్లిదండ్రులను పిలిపించి.. | Newly Married Couple Request to Police Protection in Chennai | Sakshi
Sakshi News home page

బీఏ చదివి బిస్కెట్‌ కంపెనీలో ఉద్యోగం.. వివాహం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌కు..

Published Wed, Nov 16 2022 5:08 PM | Last Updated on Wed, Nov 16 2022 5:11 PM

Newly Married Couple Request to Police Protection in Chennai - Sakshi

సాక్షి, చెన్నై(అన్నానగర్‌): తిరుచ్చి సుబ్రమణ్యపురానికి చెందిన కార్తీక్‌ (23) బీఏ చదివి బిస్కెట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న సెంతనీర్‌ పురం సమీపంలో ఉన్న వరగనేరి పిచ్చై పట్టణానికి చెందిన అంగుస్వామి కుమార్తె అభినయ(19)ను ప్రేమించాడు.

వారిద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారనే భయంతో సమయపురంలోని ఆది మారియమ్మన్‌ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం సమయపురం పోలీసులను ఆశ్రయించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి చర్చలు జరిపారు. రాజీ కుదరడంతో పెళ్లికూమార్తెను వరుడితో పాటు పంపించారు.   

చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. భర్త పలుమార్లు హెచ్చరించినా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement