మద్యం మత్తులో తనపై దాడిచేయబోయిన తండ్రి నుంచి తప్పించుకునే క్రమంలో తనయుడు గొడ్డలి లాక్కున్నాడు.
ఓడీ చెరువు (పుట్టపర్తి) : మద్యం మత్తులో తనపై దాడిచేయబోయిన తండ్రి నుంచి తప్పించుకునే క్రమంలో తనయుడు గొడ్డలి లాక్కున్నాడు. ఈ ఘటనలో తండ్రికి గాయాలయ్యాయి. ఓడీ చెరువు మండల కేంద్రానికి చెందిన గాండ్ల నాగప్ప కుమారుడు కార్తీక్ గౌనిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ అక్కడే ఉన్న బీసీ హాస్టల్‌లో ఉంటున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు ఉండటంతో శుక్రవారం ఇంటికి వచ్చాడు.
సాయంత్రం నాగప్ప మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చాడు. కుమారుడు కనిపించడంతో ‘ఎందుకొచ్చవావ్.. హాస్టల్‌లోనే ఉండకూడదా’ అంటూ గొడ్డలితో దాడిచేయబోయాడు. తప్పించుకున్న కార్తీక్ గొడ్డలిని లాక్కోబోయే క్రమంలో తండ్రి నాగప్పకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని భార్య ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది.