nagappa
-
తనయుడి చేతిలో తండ్రికి గాయాలు
ఓడీ చెరువు (పుట్టపర్తి) : మద్యం మత్తులో తనపై దాడిచేయబోయిన తండ్రి నుంచి తప్పించుకునే క్రమంలో తనయుడు గొడ్డలి లాక్కున్నాడు. ఈ ఘటనలో తండ్రికి గాయాలయ్యాయి. ఓడీ చెరువు మండల కేంద్రానికి చెందిన గాండ్ల నాగప్ప కుమారుడు కార్తీక్ గౌనిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ అక్కడే ఉన్న బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు ఉండటంతో శుక్రవారం ఇంటికి వచ్చాడు. సాయంత్రం నాగప్ప మద్యం మత్తులో తూలుతూ ఇంటికి వచ్చాడు. కుమారుడు కనిపించడంతో ‘ఎందుకొచ్చవావ్.. హాస్టల్లోనే ఉండకూడదా’ అంటూ గొడ్డలితో దాడిచేయబోయాడు. తప్పించుకున్న కార్తీక్ గొడ్డలిని లాక్కోబోయే క్రమంలో తండ్రి నాగప్పకు గాయాలయ్యాయి. వెంటనే అతడిని భార్య ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. -
దయలేని దేవుడు
- పది రోజుల కిందట భార్య మృతి - డెత్ సర్టిఫికెట్ కోసం వస్తూ రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం - మరో ప్రమాదంలో రిటైర్డ్ వైద్యురాలు.. దయలేని దేవుడు.. చిన్నచూపు చూశాడు. వృద్ధాప్యంలో తోడు లేకుండా చేశాడు. పది రోజుల కిందట భార్య చనిపోగా.. ఆ వియోగం నుంచి ఇంకా అతను పూర్తిగా కోలుకోలేకపోయాడు. భార్య డెత్ సర్టిఫికెట్ కోసం వస్తున్న అతనిపై మృత్యువు పగబట్టింది. అప్పటి వరకు తాను ప్రయాణించి వచ్చిన బస్సు చక్రాల కిందే పడి అతను మరణించారు. వరుసగా జరిగిన ఘటనతో వారి ఏకైక కుమార్తె కన్నీరుమున్నీరైంది. మరో ప్రమాదంలో రిటైర్డ్ వైద్యురాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు సంఘటనలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగాయి. తాడిపత్రి టౌన్ : తాడిపత్రి ఆర్టీసీ బస్డాండ్ ఆవరణలో బస్సు కింద పడి బందార్లపల్లికి చెందిన నాగప్ప(65) మరణించారు. పట్టణ ఎస్ఐ ఆంజనేయులు కథనం మేరకు...నాగప్పకు మగపిల్లలు లేరు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెను కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు పెళ్లి చేసిచ్చారు. నాగప్ప తన భార్యతో కలసి బందార్లపల్లిలోనే ఉండేవారు. అయితే పది రోజుల కిందట భార్య చనిపోగా, అప్పటి నుంచి ఆయన కుమార్తె వద్ద ఉండేవారు. భార్య మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం తుమ్మలపెంట నుంచి తాడిపత్రికి బుధవారం బయలుదేరి వచ్చారు. బస్సు దిగి దిగుతుండగానే డ్రైవర్ షెక్షావలి నిర్లక్ష్యంతో బస్సును నడపడంతో అతను కిందపడ్డారు. దీంతో తలకు పెద్ద గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. పాత కొత్తచెరువు వద్ద రిటైర్డ్ వైద్యురాలు.. గుంతకల్లు రూరల్ : గుత్తి-గుంతకల్లు రహదారిలోని పాత కొత్తచెరువు వద్ద జరిగిన ప్రమాదంలో రిటైర్డ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ లీలావతి(64) మరణించారు. గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో ఆమె ఈఎన్టీ స్పెషలిస్ట్‌గా మెరుగైన సేవలందించి, ఈ ప్రాంత ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం ఐదేళ్లుగా ఆమె గుంతకల్లులోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలో ధర్మవరంలోని బంధువులను కలిసేందుకు బుధవారం ఉదయం తన కారు డ్రైవర్ మునిరాజుతో కలసి బయలుదేరారు. మార్గమధ్యంలోని పాతకొత్తచెరువు వద్దకు రాగానే ఎదురుగా విపరీతమైన వేగంతో వచ్చిన బొలేరో వాహనం ఢీకొనడంతో లీలావతి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, డ్రైవర్ మునిరాజు స్వల్పంగా గాయపడ్డారు. వారిద్దరినీ 108లో గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే లీలావతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి వద్దనున్న సుమారు రూ.3 లక్షలకు పైగా నగదును ఆమె బంధువులకు 108 సిబ్బంది అప్పజెప్పి తమ నిజాయితీ చాటుకున్నారు. -
వడదెబ్బకు వృద్ధుడి బలి
గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్ల మండలం గంగాదేవిపల్లిలో వడదెబ్బకు గురై నాగప్ప(65) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బుధవారం పొలంలో పనులు చూసుకుని రాత్రికి ఇంటికి రాగానే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వివరించారు. గురువారం ఉదయమే ఇంటిలో నిద్రలోనే ప్రాణాలు వదిలినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. -
మరణంలోనూ వీడని బంధం
కడదాకా ఒకరికొకరు తోడుంటామని.. ఆదర్శ జీవనయానం సాగించిన ఆ దంపతులు ఒకరి తరువాత మరొకరు తనువు చాలించారు. అనారోగ్యానికి గురైన భార్య మరణించడంతో ఆ దుఃఖాన్ని తట్టుకోలేక గుండెపగిలి భర్త కనుమూశాడు. ఈ విషాదకర సంఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్ గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్‌కు చెందిన బండర్‌పల్లి మణెమ్మ(70), నాగప్ప(75) దంపతులు అన్యోన్యంగా దాంపత్య జీవితం గడిపారు. వీరికి కూతురు, కొడుకు సంతానం కాగా, కొడుకు ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడు. కొడుకు లేడనే వేదనతో మణెమ్మ గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. నాగప్ప రెక్కలకష్టం మీదే ఆ కుటుంబం బతుకీడుస్తోంది. మంచంపట్టిన భార్యకు నాగన్నే అన్ని సపర్యలూ చేసేవాడు. చేతగాని వయస్సులోనూ ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మ మంగళవారం రాత్రి కనుమూసింది. అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. మణెమ్మ చనిపోయిన విషయాన్ని బంధువులకు చెప్పగా, వారు రావడానికి కొంత ఆలస్యమైంది. బుధవారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఇళ్లకు చేరుకున్నారు. ఎవరి దుఃఖంలో వారున్నారు. తోడునీడ లేదని.. పుట్టెడు శోకంతో ఉన్న నాగన్న సాయంత్రం 4:30 గంటలకు కుమిలి కుమిలి ఇంట్లోనే కన్నుమూశాడు. భార్యాభర్తలు ఒకేరోజు.. కొన్ని గంటల వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.