గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్ల మండలం గంగాదేవిపల్లిలో వడదెబ్బకు గురై నాగప్ప(65) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బుధవారం పొలంలో పనులు చూసుకుని రాత్రికి ఇంటికి రాగానే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వివరించారు. గురువారం ఉదయమే ఇంటిలో నిద్రలోనే ప్రాణాలు వదిలినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు.