old man dies
-
పోలింగ్ బూత్‌లో అపశృతి..వృద్ధుడు మృతి
-
డెంగీ జ్వరంతో వృద్ధుడు మృతి
నార్పల: డెంగీ జ్వరంతో మూడురోజులుగా అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నార్పల మండలం బి.పప్పూరుకు చెందిన దండువారిపల్లి బాలన్న (65) బుధవారం మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వృద్ధుడిని తోసేసిన తాగుబోతు
పుట్టపర్తి అర్బన్: గొడవపడొద్దని సర్దిచెప్పబోయిన వృద్ధుడిని తాగుబోతు బలంగా తోసేశాడు. రాయిపై పడటంతో బలమైన దెబ్బ తగిలి వృద్ధుడు ప్రాణం విడిచాడు. అర్బన్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపిన మేరకు.. పుట్టపర్తిలోని గోపురం వీధిలో గల అపార్ట్మెంట్లో నివసిస్తున్న మిలటరీ వెంకటేష్ (64), వాచ్‌మన్ కేశవ, ట్యాక్సీ డ్రైవర్ సురేష్‌బాబు శనివారం రాత్రి గొడవపడ్డారు. మిలటరీ వెంకటేష్ భార్య జయలక్ష్మి వచ్చి సర్దిచెప్పి పంపింది. అనంతరం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సురేష్‌బాబు పూటుగా మద్యం తాగొచ్చి మరోసారి వాచ్‌మన్‌తో గొడవకు దిగాడు. నిద్రాభంగమైన మిలటరీ వెంకటేష్ అపార్ట్మెంట్ మెంట్ కిందకు వచ్చి గొడవపడొద్దని ఇద్దరినీ మందలించాడు. తాగిన మైకంలో ఉన్న సురేష్‌బాబు బలంగా తోసేయడంతో రాయిపై పడిన వెంకటేష్ తలకు బలమైన గాయమై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే సత్యసాయి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆదివారం పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామం బుక్కపట్నం మండలం అగ్రహారం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దాడికి కారణమైన సురేష్‌బాబును అరెస్టు చేశామని సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిపారు. -
వడదెబ్బకు వృద్ధుడి బలి
తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం కునుకుంట్లలో భూమే కాటమయ్య(65) వడదెబ్బకు గురై బుధవారం ఉదయం మరణించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఒడ్డున ఉన్న ఓసూరమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న ఆయన.. ఉదయమే ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 11.45 గంటలకు ఇంటికొచ్చారు. రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య లక్ష్మీనారాయణమ్మ, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైద్యాధికారి రవికాంత్, ఎంపీహెచ్ఈఓలు వెంకటయ్య, మనోహర్, పీహెచ్ఎన్ చంద్రకళ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
అగళి (మడకశిర) : అగళి మండలం రామనపల్లిలో తపాలా శాఖకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రుద్రప్ప(65) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఎండవేడిమితో కాళ్లు, చేతుల్లో బొబ్బలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం కూడా పనులు చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన అక్కడే సొమ్మసిల్లిపడిపోయాడన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడని వివరించారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
హిందూపురం అర్బన్ : హిందూపురం శ్రీకంఠపురంలో అశ్వత్థప్ప(70) వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు పుట్టపర్తి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తరువాత రాత్రి ఇంటికి చేరుకున్న ఆయన ఉదయాన్నే మృతి చెందాడని వారు విలపించారు. -
వడదెబ్బకు వృద్ధుడి బలి
గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్ల మండలం గంగాదేవిపల్లిలో వడదెబ్బకు గురై నాగప్ప(65) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బుధవారం పొలంలో పనులు చూసుకుని రాత్రికి ఇంటికి రాగానే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వివరించారు. గురువారం ఉదయమే ఇంటిలో నిద్రలోనే ప్రాణాలు వదిలినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు. -
వడదెబ్బతో వృద్ధుడు మృతి
తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం తురవారిపల్లికి చెందిన కాటం కాటమయ్య(70) అనే వృద్ధుడు వడదెబ్బతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటమయ్య మంగళవారం పగలంతా వ్యవసాయ పనులు చేశాడు. సాయంత్రం ఐదు గంటల నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు వైఎస్సార్ జిల్లా పార్నపల్లికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం పులివెందులలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇతనికి భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
వృద్ధుడు అనుమానాస్పద మృతి
గుత్తి (గుంతకల్లు) : గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మేరీస్ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు (60) అనుమానాస్పద స్థి«తిలో మృతి చెందాడు. తలపై బలమైన గాయాలు, రక్తస్రావమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహం దుర్వాసన వస్తోంది. రెండు రోజుల కిందటే ఎవరో కొట్టి చంపేసినట్లు తెలుస్తోంది. హెడ్‌కానిస్టేబుల్ చెలమయ్య శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
అతిగా మద్యం తాగి వృద్ధుడి మృతి
గోరంట్ల (పెనుకొండ) : మండల కేంద్రం గోరంట్లకు చెందిన ఎరుకుల రామాంజనేయులు (60) సోమవారం అతిగా మద్యం తాగి చనిపోయాడు. వైన్‌షాపు వద్దే ప్రాణాలు విడిచినట్లు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. -
ఇల్లు కూలి వృద్ధుడు మృతి
సిరికొండ(నిజామాబాద్): భారీ వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని గడ్డమీదితండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. తండాకు చెందిన కిష్టయ్య(65) శనివారం రాత్రి తన గుడిసెలో నిద్రిస్తుండగా.. ఒక్క సారిగా ఇల్లు కుప్పకూలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. -
శతాధిక వృద్దుడు మృతి
కేఎస్‌దొడ్డి(గుమ్మఘట్ట): గుమ్మఘట్ట మండలంలోని కరి సూరయ్యదొడ్డికి చెందిన శతాధిక వృద్ధుడు పెద్ద సూరయ్య (105) గురువారం మృతి చెందాడు. ఇతడికి మగ్గురు కుమారులు, దుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు పాలయ్యకు 85 ఏళ్ల వయస్సున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధుడైనా అతని పని అతడే చేసుకునేవాడని గ్రామంలో పలువురు చర్చించుకున్నారు. -
ఎండవేడికి వృద్ధుడి మృతి
లక్కిరెడ్డిపల్లి (వైఎస్సార్‌జిల్లా): వర్షాలు లేక ఎండలు దంచి కొడుతుండడంతో వృద్ధుల ప్రాణాల మీదకు వస్తోంది. వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామంలో ఎండవేడికి తట్టుకోలేక సుబ్బయ్య (70) అనే వృద్ధుడు పొలంలోనే ప్రాణాలు విడిచాడు. శుక్రవారం ఉదయం పొలం కాపలాకు వెళ్లిన సుబ్బయ్య సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. పొలంలోనే అతడు కూలబడిపోయి కనిపించాడు. ఎండకు తట్టుకోలేక అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.