పుట్టపర్తి అర్బన్: గొడవపడొద్దని సర్దిచెప్పబోయిన వృద్ధుడిని తాగుబోతు బలంగా తోసేశాడు. రాయిపై పడటంతో బలమైన దెబ్బ తగిలి వృద్ధుడు ప్రాణం విడిచాడు. అర్బన్ సీఐ బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపిన మేరకు.. పుట్టపర్తిలోని గోపురం వీధిలో గల అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మిలటరీ వెంకటేష్ (64), వాచ్‌మన్ కేశవ, ట్యాక్సీ డ్రైవర్ సురేష్‌బాబు శనివారం రాత్రి గొడవపడ్డారు. మిలటరీ వెంకటేష్ భార్య జయలక్ష్మి వచ్చి సర్దిచెప్పి పంపింది. అనంతరం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సురేష్‌బాబు పూటుగా మద్యం తాగొచ్చి మరోసారి వాచ్‌మన్‌తో గొడవకు దిగాడు. నిద్రాభంగమైన మిలటరీ వెంకటేష్ అపార్ట్‌మెంట్ మెంట్ కిందకు వచ్చి గొడవపడొద్దని ఇద్దరినీ మందలించాడు.
తాగిన మైకంలో ఉన్న సురేష్‌బాబు బలంగా తోసేయడంతో రాయిపై పడిన వెంకటేష్ తలకు బలమైన గాయమై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే సత్యసాయి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆదివారం పోస్ట్‌మార్టం అనంతరం స్వగ్రామం బుక్కపట్నం మండలం అగ్రహారం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దాడికి కారణమైన సురేష్‌బాబును అరెస్టు చేశామని సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి తెలిపారు.
వృద్ధుడిని తోసేసిన తాగుబోతు
Published Sun, Jul 30 2017 9:30 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM
Advertisement
Advertisement