వడదెబ్బకు వృద్ధుడి బలి | old man dies of sun strokes | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వృద్ధుడి బలి

Published Wed, May 17 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM

old man dies of sun strokes

తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం కునుకుంట్లలో భూమే కాటమయ్య(65) వడదెబ్బకు గురై బుధవారం ఉదయం మరణించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలోని పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ ఒడ్డున ఉన్న ఓసూరమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న ఆయన.. ఉదయమే ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 11.45 గంటలకు ఇంటికొచ్చారు. రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య లక్ష్మీనారాయణమ్మ, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైద్యాధికారి రవికాంత్, ఎంపీహెచ్‌ఈఓలు వెంకటయ్య, మనోహర్, పీహెచ్‌ఎన్‌ చంద్రకళ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement