katamaiah
-
ఇంటి పైకప్పు మరమ్మతు చేస్తుండగా..
బత్తలపల్లి: ముష్టూరు గ్రామానికి చెందిన కుమ్మర కాటమయ్య (68) ఇంట్లోనే చిల్లరకొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు రంధ్రం పడింది. కాటమయ్య శుక్రవారం మరమ్మతు చేయడానికి ఇంటిపైకెక్కాడు. విద్యుత్ ప్రసరిస్తున్న సర్వీస్వైరు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆయన్ని కిందకు తీసుకొచ్చి సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందాడు. ఎస్ఐ హారున్బాషాకు సమాచారం అందించారు. మృతునికి భార్య అంజినమ్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
వడదెబ్బకు వృద్ధుడి బలి
తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం కునుకుంట్లలో భూమే కాటమయ్య(65) వడదెబ్బకు గురై బుధవారం ఉదయం మరణించినట్లు బంధువులు తెలిపారు. గ్రామంలోని పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఒడ్డున ఉన్న ఓసూరమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న ఆయన.. ఉదయమే ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత 11.45 గంటలకు ఇంటికొచ్చారు. రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. మృతునికి భార్య లక్ష్మీనారాయణమ్మ, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైద్యాధికారి రవికాంత్, ఎంపీహెచ్ఈఓలు వెంకటయ్య, మనోహర్, పీహెచ్ఎన్ చంద్రకళ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు. -
వడదెబ్బతో వృద్ధుడు మృతి
తాడిమర్రి (ధర్మవరం) : తాడిమర్రి మండలం తురవారిపల్లికి చెందిన కాటం కాటమయ్య(70) అనే వృద్ధుడు వడదెబ్బతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటమయ్య మంగళవారం పగలంతా వ్యవసాయ పనులు చేశాడు. సాయంత్రం ఐదు గంటల నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు వైఎస్సార్ జిల్లా పార్నపల్లికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం పులివెందులలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇతనికి భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.